»   » అల్లు అర్జున్ కే అవార్డు దక్కేలా ఫేక్ ఓట్లు.....తొలగించిన "సైమా"?

అల్లు అర్జున్ కే అవార్డు దక్కేలా ఫేక్ ఓట్లు.....తొలగించిన "సైమా"?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్' ప్రతి ఏటా గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ అవార్డుల సందడి మొదలైంది. ఇటీవలే ఈ అవార్డులకు నామినేషన్స్ కూడా ప్రకటించారు. జూన్ 30, జులై 1వ తేదీల్లో సింగపూర్ లో జరిగే వేడుకలో విజేతలకు అవార్డులను ప్రదానం చేయబోతున్నారు.

తెలుగు నుండి బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ప్రభాస్(బాహుబలి), మహేష్ బాబు (శ్రీమంతుడు), అల్లు అర్జున్ (రుద్రమదేవి), నాని (భలే భలే మగాడివోయ్), వరుణ్ తేజ్ (కంచె) పోటీ పడుతున్నారు. అయితే పోటీ ప్రధానంగా ప్రభాస్, మహేష్ బాబు మధ్యే నడుస్తుంది. ఈ ఇద్దరు స్టార్ల ఓట్ల శాతం కూడా దాదాపు సమానంగా ఉంది. ఓటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఇదే పరిస్థితి. వీరి ఇద్దరు దాదాపు చెరో 40% శాతం ఓట్లతో నువ్వా నేనా అన్నట్లు దూసుకెలుతున్నారు. తర్వాత 11% ఓట్లతో అల్లు అర్జున్ ఉన్నారు.

SIIMA-2016: Allu Arjun's Fake Votes Removed

అయితే నిన్న రాత్రి ఉన్నట్టుండి అల్లు అర్జున్ ఓట్ల శాతం భారీగా పెరిగిందని, ఊహించని విధంగా ప్రభాస్, మహేష్ బాబు ఓట్ల శాతం తగ్గిపోయింది, ఇది చూసి అంతా షాకయ్యారని, ఓటింగ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సైమా సైతం ఆశ్చర్య పోయిందని, క్రాస్ చెక్ చేస్తే బన్నీకి 30వేల ఫేక్ ఓట్లు పడ్డాయని తేలిందని, వెంటనే ఆ ఓట్లను సైమా తొలగించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

బన్నీ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నమా?
అసలు ఫేక్ ఓట్లు వేయడం సాధ్యమేనా? అలాంటి అవకాశం అయితే అక్కడ కనిపించడం లేదు. ఓట్లు తొలగించినట్లు సైమా కూడా అఫీషియల్ గా ప్రకటించలేదు. మరి ఈ ప్రచారం ఎలా తెరపైకి వచ్చింది? ఇదంతా బన్నీ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నమా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతుంది.

English summary
The most awaited South Indian International Movie Awards- Siima is back. The nominees were announced recently. Top heroes like Mahesh, Allu Arjun, Prabhas have been nominated for best actor award. A panel of veteran judges from the film industries will select the winner and the audiences can also have chance to decide the winner by voting online in SIIMA official website.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu