Viswambhara: చిరంజీవి సినిమాలో బడా స్టార్ హీరో.. విశ్వంభర మల్టీస్టారర్ మూవీనా!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి నాటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ఫుల్ స్పీడ్‌గా దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన ఆయన.. మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఇప్పుడు 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సినిమానే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఇక, త్వరలోనే ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
విభిన్నమైన కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. అంతేకాదు, కొందరు యాక్టర్లను కూడా ఫైనల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో శింబును ఈ చిత్రం కోసం ఫైనల్ చేసినట్లు తెలిసింది.

విజువల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' మూవీలో తమిళ స్టార్ హీరో శింబు కూడా నటిస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అతడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నట్లు మరో న్యూస్ లీకైంది. త్వరలోనే అతడు ఈ మూవీ షూట్‌లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. దీంతో 'విశ్వంభర' మూవీ మల్టీస్టారర్ అయిపోయినట్లు అయింది.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











