చీప్ గా ఇలియానా చెల్లెలు
ఇలియానా తన చెల్లి లాంచింగ్ కోసం రంగం సిద్దం చేయటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయని సమచారం. తమిళ లిటిల్ సూపర్ స్టార్ శింబు తన చిత్రంలో ఇలియానాకు, ఆమె చెల్లికి కలిపి ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇలియానాకు కోటి ఇచ్చి ఆమె చెల్లిని మాత్రం మరీ చీప్ రేటుకే కొట్టేసాడని వినపడుతోంది. మొత్తం కోటి తొమ్మిది లక్షలకే బేరం ఫైనలైజ్ అయ్యిందని తెలుస్తోంది. అంటే తొమ్మిది లక్షలు ఇస్తున్నట్లు కదా అంటే అదేం కాదు ఆ తొమ్మిది లక్షల్లో ఇలియానా కన్వీనయన్స్ కూడా ఉంటుందని దర్శక, నిర్మాతలుచెప్తున్నారు. ఇక ఇలియానా సిస్టర్ కాబట్టి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందని దానని క్యాష్ చేసుకోబోతున్నామనే ఉషారులో వారున్నారు. ఇలియానా మాత్రం తన చెల్లికి పెద్ద బ్యానర్ లో పెద్ద హీరో ప్రక్కన ఇంట్రడ్యూస్ చేయాలనే ఆకాంక్ష ఉందంటున్నారు.
ఇక కిక్ తో అందరి మతులూ పొగొట్టిన ఇలియానా కొద్ది రోజులుగా తన చెల్లెలిని కూడా రంగంలోకి దించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం ఆమె స్టార్స్ నైట్ పార్టీలకు చెల్లిని తోడుగా తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తోంది. అలాగే తమిళ, తెలుగు పరిశ్రమలలోని పెద్ద నిర్మాత, దర్శకులకు తన చెల్లెలు ఫొటోలు, వీడియోలు పంపి ఆఫర్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. అయితే ఆ మధ్య ఓ సక్సెస్ ఫుల్ చిన్న నిర్మాత ఒకరు ఆమెతో చేయటానికి ముందుకు వచ్చినా కాదని తిప్పికొట్టిందని తెలుస్తోంది. అందుకే కాస్త తక్కువనిపించినా శింబు ప్రక్కన అనేసరికి మారు మాట్లాడకుండా ఆఫర్ ఒప్పుకుందని సమాచారం. మొత్తానికి అక్క, చెల్లెళ్ళద్దరూ వ్యాపారం బేరాలాడి మరీ ఫైనలైజ్ చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











