బాలయ్య 'సింహా' ఆడియో పంక్షన్ లేనట్టేనా?
బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా' ఆడియోను ఫంక్షన్ జరపకుండా డైరక్ట్ గా మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదట గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామనుకున్నా బాలకృష్ణ ఇన్పెక్షన్ తో కేర్ ఆస్పత్రిలో చేరటం, తగ్గటానికి కొంత కాలం పడుతుందని, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే రిలీజ్ కు కొద్ది రోజులు ముందు ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఉన్న వివరాలు ప్రకారం సింహా చిత్రం ఏప్రియల్ 16న రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. బాలకృష్ణ సరసన నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రోమోలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంతో వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న బాలయ్య తిరిగి పుంజుకుంటారని పరిశ్రమవర్గాలు,అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











