బాలయ్య ‘సింహా’ ముందు మూగబోయిన జూ ఎన్టీఆర్ వాయిస్!
హలో ఎందుకు అంత తొందర ఇది జూ ఎన్టీఆర్ పర్సనల్ విషయం కాదండి. మీరేం ఫీలవ్వక్కరలేదు. తాజాగా విడుదలైనటువంటి చిత్రం రామరామ కష్ణకష్ణ గురించి. ఏం లేదండి ఆ మధ్య జల్సా సినిమాకి ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. సినిమా హిట్ అనిపించుకున్నారు. ఎందుకంటే పవన్స్ ఫ్యాన్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ ని సినిమాని ఆకట్టుకొంటుదనే చెప్పొచ్చు. ఆ ఉద్దేశముతో ఈ మధ్య స్టార్ హీరో వాయిస్ ను ఇన్ ట్రడక్షన్ రూపంలో ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. అది సక్సెస్ అయితే సినిమాకి ప్లస్ పాయిట్ అంటారు. కొంచెం ఇటు అటు అయితే అదే నెగటివ్ పాయింట్ అంటారు.
ఇక అసలు విషయానికొస్తే ఈ మధ్య విడుదలైన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి ఇంట్రడక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వటంతో సినిమాకి బాగా ప్లస్ అవుతుందని చిత్ర నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ లు తెగ ఢంఖా మ్రోగించేసుకున్నారు. ప్రతి ప్రెస్ మీట్ లోనూ ఇదే విషయాన్ని పబ్లిసిటీ బాగా చేశారు. కానీ సినిమా చూసిన జనాలకి జూ ఎన్టీఆర్ వాయిస్ విన్నట్టు కూడా గుర్తుండదు. అవును మరి హీరో ఇంట్రడక్షన్ సీను ముందు ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి, అది తాను న్యాచురల్ స్టైల్ లో కాకుండా దమ్ములేని మాటలు మాట్లాడేసి ఇది వాయిస్ ఓవర్ అంటే నమ్మడానికి జనాలు ఫ్రీగా రాలేదు కదా మరి.
ఇక రామ రామ కృష్ణ కృష్ణ సినిమా సింహా చిత్రానికి పోటీ అని అన్న వాళ్లు సైతం జూనియర్ వాయిస్ కూడా సినిమాకు అచ్చిరాక సింహా ముందు తోక ముడిచిందని గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











