బాలయ్య బాక్సపీస్ లో ‘సింహా’గా సృష్టించిన కొత్త రికార్డులు వివరాలు!
ఏప్రిల్ 30న విడుదలైన 'సింహా" ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది. సినిమా బావుందని కొందరు. పెద్దగా బాగోలేదని కొందరు అభిప్రాయపడుతున్నా రెవెన్యూ మాత్రం బ్రహ్మాండంగా వుందనేది అందరూ ఒప్పుకుంటున్నారు. చాలా సంవత్సరాల గ్యాప్ నందమూరి బాలకృష్ణకు 'సింహా" రూపంలో సక్సెస్ రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కలెక్షన్స్ రికార్డుల్లో మాత్రం ఆల్ రెడీ అభిమానుల మద్య వాదోపవాదాలు మొదలయ్యాయి.
తొలి రోజే వసూళ్ళలో 'సింహా" దే అగ్రస్థానం అని నందమూరి అభిమానులు అంటుంటే కాదు కాదు ఆ క్రెడిట్ మా 'మగధీర" దే అని ఖండిస్తున్నారు మెగా కాంపౌండ్ మెంబర్స్. ఈ నెపథ్యంలో నిజా నిజాలను పరిశీలిస్తే అన్ని సెంటర్స్ లో కాకున్నా..కొన్ని కేంద్రాల్లో మాత్రం ఫస్ట్ డే రెవెన్యూలో 'సింహా" కొత్త రికార్డులను సృష్టించిందనే సమాచారం అందింది.
మొదటి రోజు కలెక్షన్స్ లో 'సింహా" నెలకొల్సిన కొత్త రికార్డులివే:
గుంటూరు - 73, 70, 000(షేర్)
అనంతపురం - 37, 45,000(షేర్)
కృష్ణా - 27, 50, 000(షేర్)
వెస్ట్ - 32,25,000(షేర్)
'సింహా" రికార్డులు రిజిస్టర్ అయిన వాటిలో ఇవి ప్రధాన కేంద్రాలు కాగా ఇంకా పలు బి, సి సెంటర్స్ లోనూ ఎన్నో కొత్త రికార్డులకు తెర తీసిందట ఈ చిత్రం..!


Click it and Unblock the Notifications











