చరణ్ కథ అక్కడా....

By Staff

Ram Charan Tej
తాజాగా రామ్ చరణ్ తేజ,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్ర కధని పోలిన చిత్రమొకటి తమిళంలోనూ రూపొందుతోంది. అది కూడా తమిళం లోనే గాక తెలుగులోనూ పేరున్న హాట్ డైరక్టర్ సెల్వరాఘవన్ (7 బై.జి.బృందావన కాలని) దర్శకత్వంలో కావటం మరో విశేషం. రెండు సినిమాలు ప్రేమ, పునర్జమ్మ పాయింట్ చుట్టూ తిరిగేవే. ఆ చిత్రం పేరు ఆయరత్తిల్ ఒరువన్ .అంతే గాక ఆ చిత్రం బ్యాక్ డ్రాప్ కూడా చరణ్ సినిమాలో లాగ రాజస్థాన్ కావటం మరో విచిత్రం. సూర్య సోదరుడు కార్తీక్,రీమాసేన్, ఆండ్రియా అందులో ప్రథాన పాత్రలు. ఇక తెలుగులో శ్రీహరి ముఖ్య పాత్ర ధరిస్తే..ఆ సినిమాలో పార్ధిపన్ కీలక పాత్రలో చేస్తున్నాడు.

మరి ఇలా అయితే రెండు సినిమాలు క్లాష్ కావా అని తెలిసిన వాళ్ళు ఆలోచనలో పడుతున్నారు. కాని కాస్త తెలివైన ఫిల్మ్ నగర్ వాసులు మాత్రం ఒక్కోసారు ఇలా సినిమాలు మథ్య పోలికలు కనపడటం కామనే గాని..మరి లొకేషన్లు దగ్గరనుంచా అని కామెంట్ చేస్తున్నారు . అసలు షారూఖ్ రీసెంట్ సూపర్ హిట్ ఓం శాంతి ఓం సినిమా పునర్జమ్మ చుట్టూ తిరిగే కథ కావటం తో ఈ విచిత్రాలు జరుగుతున్నాయి. ఆ సినిమానే రకరకాల భాషల్లో వివిధ రకాలుగా పునర్జమ్మ ఎత్తుతోంది అని మరి కొందరు అసలు విషయం వివరిస్తున్నారు. అయినా సెల్వరాఘవన్ కథలు యే నేపధ్యమైనా వాటిల్లో సెల్ప్ పిటీతో సాగే హీరోయిజం గ్యారెంటి. ఇక రాజమౌళి హింస,గ్లామర్ ని నమ్ముకునే పక్కా మాస్ మసాళా స్క్రిప్టు తో ఉంటుంది. ఇద్దరికి ఆవగింజ కూడా పోలికుండదు. కాబట్టి డోంట్ వర్రి అని సీనియర్లు హామి ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X