‘నా వయస్సు 16’ అంటున్నా సిమ్రాన్
ఒకప్పుడు స్టార్ గా వెలిగిన సిమ్రాన్ వేషాలు కోసం మరీ అంతగా దిగజారాలా అని కామెంట్ చేయించుకుని చేసిన చిత్రం ఒకటి తెలుగులో డబ్బింగ్ అయివస్తోంది. సాధారణంగా కెరీర్ చివరిదశలో వేషాలు లేక తమకున్న కొద్దిపాటి క్రేజ్నీ అమ్ముకునే ప్రయత్నంగా ఇలాంటి సాప్ట్ పోర్న్ చిత్రాల్లో నటిస్తుంటారు. అలాంటిది తమిళంలో రూపిందిన 'కిచా వయస్సు 16" చిత్రం. దీనిని విజయ సినీ ఎన్ టైన్మెంటులో నిర్మాత శ్రీదరన్, రాజ్ గోపాల్ తెలుగులోకి అనువాదం చేసి 'నా వయస్సు 16" పేరిట తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వారం క్రితం కిరణ్ రాధోడ్ ప్రధాన పాత్రలో మెలీనా ఇటలీ చిత్రం ఆధారంగా ఇలాంటి సినిమా ఒకటి ప్రారంభం కావటంతో ఆ ప్రేరణతో ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నిర్మాత ఎం.శ్రీధరన్ మాట్లాడుతూ ఆకాష్ ప్రత్యేకపాత్రలో నటించిన ఆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. 'ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాదించింది.
పదవ తరగతి చదువుతున్న టీచర్ గా సిమ్రాన్ నటించారు. అనిత మరో పాత్ర పోషించింది. యువతను కవ్వించే రొమాంటిక్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందింది. ప్రతీ పాటా భారీగా చిత్రీకరించాం" అన్నారు. గతంలో భానుప్రియ ప్రధాన పాత్రలోనూ ఇలాంటి కాన్సెప్ట్ తో 'టీచర్ ఐలవ్ యు" అనే చిత్రం ఒకటి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











