Salaar: ప్రభాస్‌తో డర్టీ హరి బ్యూటీ.. చిన్న హీరోయిన్‌కు ఇంత పెద్ద ఆఫరా?
కొంత కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ యమ ఫామ్‌తో కనిపిస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే పలు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు కూడా చేతి నిండా మూవీలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమానే 'సలార్'. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో మొదటి పార్టుగా 'సలార్: సీజ్‌ఫైర్'ను ముందు రిలీజ్ చేస్తున్నారు.

'సలార్' మూవీని డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను కూడా వేగంగా చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని కూడా నిర్మాతలు ప్లాన్లు చేస్తున్నారు. దీంతో చాలా రోజులుగా ప్రభాస్ సినిమా హడావిడి అంతటా కనిపిస్తోన్న విషయం తెలిసిందే.
మొదటి భాగం 'సలార్: సీజ్‌ఫైర్' గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా.. రెండో పార్టుకు సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్స్‌లో చిత్రీకరణను జరపబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

రాబోయే షెడ్యూల్‌లోనే 'సలార్' మూవీలోని సెకెండ్ పార్టులో వచ్చే స్పెషల్ సాంగ్‌ను సైతం షూట్ చేయబోతున్నారని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాలోనే ఎంతో హైలైట్ కాబోతున్న ఈ స్పెషల్ సాంగ్‌లో 'డర్టీ హరి' మూవీ ఫేం సిమ్రత్ కౌర్ ఆడిపాడనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌పై ఆమె సంతకం కూడా చేసేసిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో 'ప్రేమతో మీ కార్తీక్', 'పరిచయం', 'బంగార్రాజు'తో పాటు హిందీలో 'గదర్ 2' మూవీలోనూ నటించింది.

ఇక, 'సలార్' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











