సింధు మీనన్ 'సుభధ్ర'...ఆ హాలీవుడ్ కాపీనా?

By Srikanya

"రాత్రి పది గంటలకు ఓ భార్యా భర్త కారులో హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు బయలుదేరుతారు. తెల్లవారుజాము ఐదు గంటల వరకు జరిగే ఈ ప్రయాణంలో ఎదురైన సంఘటనల సమాహారమే 'సుభద్ర'. సింధు మీనన్‌, రవికిరణ్‌ భార్యాభర్తలుగా నటించారు. రాత్రి పదిగంటలకు ఈ చిత్రకథ ప్రారంభమై తెల్లారి అయిదు గంటలకు ముగుస్తుంది.ఈ సినిమా 2007లో వచ్చిన హాలీవుడ్ చిత్రం వేకిన్సీ కి ప్రీమేక్ గా రూపొందింది అని తెలుస్తోంది. రాత్రి ప్రయాణంలో ఓ జంట ఓ హోటల్ లో గడపటం..అక్కడ జరిగే పరిణామాలతో ఈ చిత్రం ఉత్కంఠతో నడుస్తుంది. ఈ చిత్రాన్ని చాలా మంది తెలుగైజ్ చేసి తెలుగులో పట్టుకు తిరిగారని, అయితే ఎవరకీ వర్కవుట్ కాలేదని ఫిల్మ్ నగర్ వార్త. ఇక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి కామిడీని గతంలో అందించిన రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీకాంత్ టాకీస్ పతాకంపై ఇ.శ్రీకాంత్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాత శ్రీకాంత్ గౌడ్ 'ఈ సినిమాకి కథ మెయిన్ హైలైట్. ఈ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. మేలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X