మహేష్ నిర్మాత బ్లాక్ మెయిల్!?

ఈ విషయంపై రమేష్ ప్రేస్ మీట్ పెడదామని మొదట అనుకున్నా ఆ ఇంపాక్టు సినిమాలపై పడే అవకాశముందని ఆగారని చెప్పారు. అలాగే పులి,వరుడు చిత్రాలు ఏ అడ్డంకి లేకుండా కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాక త్వరలో విశాల్ తో ఓ చిత్రం కూడా ప్రకటించటానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.
ఇక శింగనమల రమేష్ కొద్ది రోజులుగా కనపడలేదంటూ వార్తలు అంతటా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ న్యూస్ ఓ డైలీలో వచ్చిందని సమాచారం. ఇక అతనికి ఈ చిత్రాల నిర్మాణం కోసం రుణాలు ఇచ్చిన వారు వడ్డీల చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని వినపడుతోంది. అయితే మొదట్లో కరెక్టుగా కట్టిన రమేష్ కొద్ది నెలలుగా ఇవ్వటం లేదని దాంతో వారు చాలా అప్ సెట్ అయ్యారని అంటున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











