హాట్ టాపిక్ :హీరో ప్రేమలో సింగర్ గీతా మాధురి?

ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి 'అదితి 'అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు చెప్పుకున్నారు. వీరి కుటుంబాలు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్ మెంట్ కూడా జరగనున్నట్లు చెప్పుకుంటున్నారు.
గీతామాధురి నెమ్మదిగా నటనవైపు వెళుతున్నారా? తెరపై పూర్తిస్థాయి నటిగా కనిపిస్తారా? అంటే అవుననే ఇటీవలి ఘటనలు వెల్లడిస్తున్నాయి. నిన్నటికి నిన్న శ్రీహరి ప్రధానపాత్రలో నటించిన 'బకరా' చిత్రంలో ఓ గీతాన్ని ఆలపిస్తూ..నర్తించిన గీత ఆ పాటలో తన గానానికే కాదు..స్టెప్పులకూ యువత నుంచి వందశాతం మార్కులేయించుకుంది.
అదే హుషారులో ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటించిన 'షాడో' చిత్రంలోనూ ఆడిపాడింది. గీత ఈ చిత్రంలో ఓ పాటలో గాయనిగా కనిపిస్తారని తెలుస్తోంది. తెరవెనుకే కాదు..తెరపైనా ఛార్మింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న గీత నెమ్మది నెమ్మదిగా హీరోయిన్ నూ ఆరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











