twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ :హీరో ప్రేమలో సింగర్ గీతా మాధురి?

    By Srikanya
    |

    Geetha Madhuri - Anand
    హైదరాబాద్ : సినీ నేపథ్యగాయనిగా రయ్‌మని దూసుకెళుతున్న యువగాయని గీతామాధురి లవ్ స్టోరీ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె 100% లవ్ చిత్రంలో సెకండ్ హీరోగా చేసిన ఆనంద్ కృష్ణ నందుతో ప్రేమలో పడినట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు.

    ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి 'అదితి 'అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు చెప్పుకున్నారు. వీరి కుటుంబాలు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్ మెంట్ కూడా జరగనున్నట్లు చెప్పుకుంటున్నారు.

    గీతామాధురి నెమ్మదిగా నటనవైపు వెళుతున్నారా? తెరపై పూర్తిస్థాయి నటిగా కనిపిస్తారా? అంటే అవుననే ఇటీవలి ఘటనలు వెల్లడిస్తున్నాయి. నిన్నటికి నిన్న శ్రీహరి ప్రధానపాత్రలో నటించిన 'బకరా' చిత్రంలో ఓ గీతాన్ని ఆలపిస్తూ..నర్తించిన గీత ఆ పాటలో తన గానానికే కాదు..స్టెప్పులకూ యువత నుంచి వందశాతం మార్కులేయించుకుంది.

    అదే హుషారులో ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటించిన 'షాడో' చిత్రంలోనూ ఆడిపాడింది. గీత ఈ చిత్రంలో ఓ పాటలో గాయనిగా కనిపిస్తారని తెలుస్తోంది. తెరవెనుకే కాదు..తెరపైనా ఛార్మింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న గీత నెమ్మది నెమ్మదిగా హీరోయిన్ నూ ఆరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    English summary
    Geetha Madhuri and Nandu recently featured in a short film titled ‘Aditi’ and both fell in love in the making of the film. Now,Parents of both the families have given green signal to their love story.Another buzz is that their engagement will going to take place in couple of days and wedding will be in next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X