ప్రముఖ సింగర్‌కి రెండో పెళ్లంటూ ప్రచారం... ఆ ఫోటోస్ వెనుక అసలు కథ ఇదా?
ఈ మధ్య సోషల్ మీడియాలో సంబంధం లేకుండా న్యూస్ లను వైరల్ చేస్తూ ఉంటారు. ఆ హీరో.. ఈ హీరోతో ప్రేమలో పడింది.. త్వరలో పెళ్లి.. ప్రముఖ సింగర్ విడాకులు వంటి వార్తలను వైరల్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా మరో న్యూస్ వైరల్ గా మారింది. అసలు విడాకులు కాకుండా ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవికి రెండో పెళ్లంటూ ప్రచారం చేశారు. ఎప్పటివో హల్దీ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తూ.. ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ వైరల్ గా న్యూస్ స్ప్రెడ్ చేశారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు హేమ చంద్రతో ప్రేమలో పడి.. వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో సూపర్ సింగర్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వీరు.. ప్రేమలో పడి.. వివాహం కూడా చేసుకున్నారు. అంతే కాదు వీరికి ఓ పాప కూడా ఉంది. ఇదిలా ఉంటే.. శ్రావణ భార్గవి గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

శ్రావణ భార్గవి.. రెండో పెళ్లి చేసుకోబోతుంది.. దానికి సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేనా... యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ.. ప్రముఖ సింగర్ రెండో పెళ్లి అంటూ థంబ్ నెయిల్స్ క్రియేట్ చేస్తూ ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఇక న్యూస్ వైరల్ కాగా... అది చూసిన నెటిజన్స్ నిజమేనా అంటూ కంగారు పడుతున్నారు.
అసలు శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోవాలంటే.. ముందు హేమచంద్రతో విడాకులు తీసుకోవాలి. అసలు విడాకులు లేకుండానే.. ఆమెకు సోషల్ మీడియాలో రెండో పెళ్లి చేసేస్తున్నారు. అంతేనా.. తన ఫోటోలను వైరల్ చేస్తూ.. ఇవే పెళ్లి ఫోటోలు అని నమ్మేలా చేస్తున్నారు. అసలే డిజిటల్ కాలం.. ఇలా ఫోటో పెట్టినా... వెంటనే వైరల్ గా మారిపోతుంది.

ఇక అసలు విషయం ఏంటంటే.. ఆ ఫొటోలు శ్రావణ భార్గవి సోదరుడు హరీష్ హల్దీ ఫంక్షన్ లోనివి. 2022 ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ చేస్తూ... ఆమె రెండో పెళ్లి అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి గత ఏడాది ఇదే సమయంలో హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం జరిగింది. హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

2013 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట... త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించగా... వీరి సైలెన్స్ ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. అయితే అలాంటిది ఏమైనా ఉంటే.. వీరు అధికారింకంగా ప్రకటించే వారు. కానీ... ఏమి లేని చోటు కూడా... పచ్చని కాపురాల్లో ఇలా నిప్పులు పోస్తూ... ప్రచారం చేస్తున్నారని నెటిజన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











