సింగర్ సునీత విడాకులకు కారణం అదేనా?
తన స్వీట్ వాయిస్ తో పాటల ప్రపంచంలో విహరించే సునీత పర్శనల్ లైఫ్ గొప్పగా ఏమీ లేదంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె విడాకులకు అప్లై చేస్తున్నట్లు వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతదోంది. గత పద్దెమినిది నెలలుగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ పాజిటివ్ గా సమస్యను పరిష్కరించాలని ఇరువైపుల పెద్దలూ ప్రయత్నించారని అయితే అది సాధ్యం కాలేదని చెప్తున్నారు. అయితే ఈ వివాదానికి మెయిన్ కారణం వియన్ ఆదిత్యతో ఆమెకు రిలేషన్ ఉందన్న టాక్ రావటమేనంటున్నారు. నిజమా,రూమరా అనేది ప్రక్కన పెడితే అది సంసారాన్ని ఇబ్బందిపెట్టేలా చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక సునీతకు ఓ బాబు, పాప ఉన్నారు. విడాకులు తీసుకుని సింగిల్ మదర్ గా వారిని సాకాలని ఆమె ఆలోచిస్తునట్లు చెప్తున్నారు. ఆమె తన తల్లితండ్రుల వద్ద గత కొంత కాలంగా ఉంటోందని సమాచారం. ఇక సునీత అప్పట్లో వియన్ ఆదిత్యతో రిలేషన్ గురించి మాట్లాడుతూ...రూమర్స్ వస్తున్నాయని కట్ చేసుకునే ప్రెండ్ షిప్ కాదు మాది. ఒక మెచ్యుర్డ్ లెవిల్ కి ఎదిగాక, కుటుంబంలో ఇంతమందిని ఇంత జాగ్రత్తగా చూసుకున్నాక..కష్టపడి ఇంత గౌరవాన్ని సంపాదించుకున్నాక...ఆ మాత్రం ఆలోచించనా చెప్పండి..చూడండి, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు..వదిలేయటమే అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











