శ్రీజ వీడియోలే శిరీష్ కి శ్రీరామరక్ష అయితే శ్రీజ మూల్యం చెల్లించాల్సిందే...!
ప్రేమించి, పెద్దలని ఎదిరించి, వారి పరువుని దిగజార్చి, వారిని బజారుకి ఈడ్చి మరీ శిరీష్ భరద్వాజ్ ని పెళ్ళి చేసుకున్న శ్రీజ పెళ్లయి మూడేళ్లు తిరగకుండానే భర్త మీద వరకట్నం వేధింపులంటూ కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. అప్పుడు చిరంజీవిని ఎదిరించడానికి శిరీష్ భరద్వాజ్ వెనుక వున్న రాజకీయ శక్తులు ఆమెకి అండగా నిలిస్తే, ఇప్పుడు శిరీష్ ని అరెస్ట్ చేయించడానికి చిరంజీవి బలాన్ని ఆమె వాడుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పబ్లిసిటీ యావతో, ఐడెంటిటీ క్రైసిస్ తో తనని తాను సెలబ్రిటిగా చూపించుకోవాలనే పిచ్చితో శ్రీజ చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు శిరీష్ కి అడ్వాంటేజ్ గా మారనున్నాయి.
తనని భర్త వేధించాడని శ్రీజ ఎంతటి బలమైన సాక్ష్యాలు చూపించినా కానీ, నిన్న కాక మొన్న కూడా తన భర్తలాంటోడు ఉండడని, అతను బంగారమని ఛానెల్స్ సాక్షిగా సర్టిఫికెట్ ఇచ్చిన శ్రీజ మాటల్ని శిరీష్ ఇప్పుడు ఆయుధంగా వాడుకోవచ్చు. కేవలం నెల రోజుల వ్యవధిలో అంతటి మంచోడు రాక్షసుడైపోయాడా అంటూ వాదించొచ్చు. ఏదో వేలంటైన్స్ డేకి పేటెంట్ తీసుకున్న సెలబ్రిటీల్లా ఛానెల్ వాళ్లు పిలవడమే ఆలస్యం వెళ్లిపోయి సొల్లు వాగినందుకు శ్రీజ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ వేధింపులు నిజమే అయినా కానీ ఇప్పుడతడిని ఆమె ఏమీ చేయలేకపోవచ్చు. ఏదైతేనేమి పెద్దల మాటని ఎదిరించి పెళ్లాడిన జంటలకి ఆదర్శం అని ఇన్నాళ్లూ ఊదరగొట్టిన ఈ జంట అలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకునేవాళ్లకి లైవ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయింది.


Click it and Unblock the Notifications











