కృష్ణవంశిని దత్తత చేసుకున్న..
ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్తి తనకెంతో ఇష్టమైన కృష్ణవంశిని దత్తత తీసుకున్నారు.అయితే ఇది ఇప్పటి సంగతి కాదు.చాలా కాలం క్రితం చోటు చేసుకుని ఈ మద్యే ఆ విషయం బయిటకు వచ్చింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమం ద్వారావీళ్ళిద్దరూ తండ్రి కొడుకులయ్యారు. ఈ విషయాన్ని సీతారామశాస్త్రి,కృష్ణవంశి తో కలిపి చేసిన లక్ష్మీ టాక్ షో లో బయిటకు వచ్చింది. అప్పటి నుంచి పరిశ్రమలో చాలామందికి ఇది హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి సీతారామ శాస్త్రి కి ఆల్రెడీ ఓ కుమారుడు ఉన్నాడు. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ తేజ కేక చిత్రం రూపొందించారు. అలాగే కృష్ణవంశికీ తనదైన కుటుంబం ఉంది. భార్య రమ్యకృష్ణ,కుమారుడు ఉన్నారు. తమ మధ్య అనుబంధం గత ఇరవై రెండేళ్ళుగా కొనసాగుతోందని అందుకే తండ్రి,కుమారుల బంధంగా మార్చుకున్నామని చెప్పుకొచ్చారు. అలాగే సీతారామశాస్త్రి రాసిన జగమంత కుటుంబం పాటని ఎంతగానో నచ్చి దానికి తగినట్లుగా చక్రం కథను రాయించుకుని సినిమా తీసారు కృష్ణవంశి.ఏదైమైనా ఇది అరుదైన విషయం కదా..ఒక దర్శకుడుని అబిమానించి తన కొడుకుగా దత్తత చేసుకోవటం.


Click it and Unblock the Notifications











