SSMB28: మహేశ్ చెల్లెగా ఆ హీరోయిన్.. సినిమా మెయిన్ హైలైట్ లీక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరో.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంటోన్నాడు. దీంతో ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్నాడు. 'అతడు', 'ఖలేజా' వంటి రెండు క్రేజీ మూవీల తర్వాత వీళ్లిద్దరి కలయికలో మూవీ రాబోతుండడంతో.. దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఆ తర్వాత దీనికి బ్రేక్ పడిపోయింది. ఇక, కొంత గ్యాప్ తర్వాత రెండో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించి చిత్ర యూనిట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇటీవలే మహేశ్ బాబు వెకేషన్‌కు వెళ్లి రాగా.. యూనిట్ మాత్రం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మించింది. ఇప్పుడు ఇందులోనే సినిమా షూటింగ్‌ను జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన వార్త లీక్ అయింది.

Sister Sentiment Highlight in Mahesh Babu and Trivikram Movie

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎంతో మంది బడా స్టార్లు నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన కొందరు నటీనటులను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన మహేశ్ బాబు చెల్లెలి పాత్ర కోసం టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోయిన్‌ను తీసుకున్నారని తెలిసింది. అంతేకాదు, వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నాయని సమాచారం. అయితే, ఆ పాత్ర చేసే హీరోయిన్ ఎవరనేది మాత్రం తెలియలేదు.

సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X