Prabhas Project Kలో 'సీతా రామం' హీరో.. కథను మలుపు తిప్పేలా! హాలీవుడ్ ను మించేలా ప్లాన్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు.
ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో సీతా రామం హీరో నటించనున్నట్లు టాక్ వస్తోంది.

వైజయంతీ మూవీస్ లో..
జక్కన్న చెక్కిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒక్కటి ప్రాజెక్ట్ కె. ఈ సినిమాకు ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పెద్ద సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సి. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

హాలీవుడ్ కు మించి..
అయితే ప్రాజెక్ట్ కె నుంచి వస్తోన్న ఒక్కొక్క అప్డేట్ చాలా క్రేజీగా, హాలీవుడ్ కి మించిన స్థాయిలో క్యూరియాసిటీ కలిగిస్తోంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న ఓ పోస్టర్ విడుదల చేసి సినిమాపై హైప్ పెంచారు. ప్రభాస్ ఒక కవచంతో గాలిలోకి దూసుకెళ్తున్నట్లు ఉన్న ఆ పోస్టర్ పై హీరోలు పుట్టరు.. వాళ్లు ఎదుగుతారు అనే పదాలు ప్రభాస్ రోల్ ను ఎలివేట్ చేసేవిధంగా ఉన్నాయి.
అలాగే ఈ సినిమాపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలు, తర్వాత ఒక టైర్ కోసం సినిమా టీమ్ పడిన కష్టం మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

వరల్డ్ ఈజ్ వెయిటింగ్..
ఇక ఇటీవల ప్రాజెక్ట్ కె విడుదల తేదిని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ మైండ్ బ్లోయింగ్ లా ఉంది. అందులో ఎడారి వంటి ప్రదేశంలో ఒక పెద్ద అర చేతి ఉంది. కానీ దాని బాడి మాత్రం కనిపించదు. ఆ పెద్ద అర చేతి ముందు ముగ్గురు గన్స్ పట్టుకుని ఉండటం.. వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అనే క్యాప్షన్ లోపల ఇంకా చాలా ఉన్నాయి.. దాచి ఉంచాం అని బాలయ్య చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. క్రేజీ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చే ఏడాది అంటే 2024న విడుదల చేయనున్నారు.

సీతా రామం హీరో..
ఇక ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెతోపాటు దిశా పటానీ కూడా అలరించనుంది. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా భారీ తారాగణంలో ప్రభాస్ ను హీరోగా పెట్టి నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఈ క్యాస్టింగ్ లోకు సీతా రామం హీరో దుల్కర్ సల్మాన్ చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తెలుగు హీరోగా..
మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తాను చేసిన డబ్బింగ్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. ఓకే బంగారం సినిమాతో లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసి విమర్శకులు సైతం పొగిడేలా చేశాడు. ఇక గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సీతా రామం ద్వారా తెలుగు హీరోగా మారిపోయాడు. తెలుగులోనూ ఫ్యాన్స్ ను పెంచుకుంటూ పోతున్న దుల్కర్ ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నాడనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది.

కథకు కీలకం.. విలన్ గానా?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబాలో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో దుల్కర్ సల్మాన్ కేమియో రోల్ చేయనున్నట్లు సమాచారం. ఇందులో దుల్కర్ పాత్ర సమయం తక్కువగా ఉన్నప్పటికీ కథకు చాలా అవసరం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఎంట్రీ కీలక సమయంలో ఉంటుందని, అది కథనాన్ని మరింత ముందుకు నడిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే అనేక విషయాలు ఆధారపడి ఉంటాయని చర్చ నడుస్తోంది. అయితే దుల్కర్ విలన్ గానా లేకా ఇంకేదైన పాత్రలో నటిస్తున్నాడనేది క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











