సితార ఘట్టమనేని టాలీవుడ్ ఎంట్రీ.. కూతురితో మహేశ్ సూపర్ ప్లాన్.. ఎలాంటి పాత్ర చేస్తుందో తెలిస్తే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే బడా స్టార్లుగా ఎదిగిపోయి హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేశ్ బాబు ఒకడు. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. దాదాపు రెండు దశాబ్దాలుగా స్టామినాను చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇక, తాజాగా మహేశ్ బాబు తన కూతురు సితారను సినిమాల్లోకి పరిచయం చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

వరుస హిట్లతో మహేశ్ దూకుడు

వరుస హిట్లతో మహేశ్ దూకుడు

ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకోవడమే. ఇలా హ్యాట్రిక్‌ను కూడా అందుకున్న ఈ స్టార్ హీరో.. అలాగే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

సర్కారు వారి పాటతో నిరాశగానే

సర్కారు వారి పాటతో నిరాశగానే

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేశాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. దీనికి థమన్ సంగీతం ఇచ్చాడు. ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నా టార్గెట్‌ను మాత్రం చేరలేదు.

త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు ఫిల్మ్

త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు ఫిల్మ్

వరుస విజయాలతో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు.. త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

యాక్షన్ మోడ్‌తో ఫస్ట్ షెడ్యూల్

యాక్షన్ మోడ్‌తో ఫస్ట్ షెడ్యూల్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఇదంతా అదిరిపోయేలా వచ్చిందని తెలుస్తోంది. ఇక, తల్లి ఇందిరా దేవి మరణంతో మహేశ్ బాబు తన సినిమా షూటింగ్‌కు కాస్త విరామం ప్రకటించినట్లు టాక్ వినిపిస్తోంది.

మహేశ్ బాబు కూతురు ఎంట్రీ

మహేశ్ బాబు కూతురు ఎంట్రీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే తన కొడుకు గౌతమ్‌ను చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే 'సర్కారు వారి పాట' కోసం తన కూతురు సితార ఘట్టమనేనితో ఓ ప్రమోషనల్ సాంగ్‌ను కూడా చేయించాడు. ఇక, ఇప్పుడు ఈ చిన్నారిని మహేశ్ బాబు ఏకంగా సినిమాల్లోకి తీసుకు రాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కూతురితో మహేశ్ సూపర్ ప్లాన్

కూతురితో మహేశ్ సూపర్ ప్లాన్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారానే తన కూతురు సితార ఘట్టమనేనిని సినీ రంగానికి పరిచయం చేయబోతున్నాడని తాజాగా తెలిసింది. దీనికోసం ఇప్పటికే ఈ చిన్నారికి యాక్టింగ్, డ్యాన్స్‌లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడని అంటున్నారు. ఆమె ఎంట్రీని సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్ చేశారని టాక్.

ఏ పాత్రను చేయబోతుందంటే

ఏ పాత్రను చేయబోతుందంటే

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఓ పాట పాత్ర హైలైట్ కాబోతుందట. ఆమెను కాపాడేందుకు హీరో ప్రయత్నాలు చేస్తుంటాడట. ఇప్పడీ పాత్రలోనే సితార కనిపించబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, మహేశ్ - సితార మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని చోట్ల ఫన్నీగా, కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X