మహేశ్ బాబు సినిమాల్లో సితారకు నచ్చిన ఒకే ఒక్క చిత్రం.. ఏ సినిమా అంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నెక్ట్స్ పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్రాజెక్ట్ కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు మహేశ్ బాబు కేవలం రీజినల్ చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యారు. తొలిసారిగా వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇక మహేశ్ బాబు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే ఆయన కూతురు సితార ఘట్టమనేనికి మాత్రం తండ్రి మహేశ్ బాబు సినిమాల్లో కేవలం ఒకే ఒక్క సినిమా నచ్చుదని చెప్పింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మల్టీ టాలెంటెడ్ గా సితార ఘట్టమనేని..
మహేశ్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని అందరికీ సుపరిచితురాలే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులతో పాటు తన తండ్రి మహేశ్ బాబు గురించి కూడా ఆసక్తికరమైన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. ఇక సితార డ్యాన్సింగ్, సింగింగ్, ఎడ్యుకేషన్, మోడలింగ్ లోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. మున్ముందు మరిన్ని స్కిల్స్ ను నేర్చుకునే పనిలో బిజీగా ఉంది. ఓవైపు తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోవైపు మోడలింగ్ లోనూ రాణించాలని అనుకుంటోంది. ఈ క్రమంలో మల్టీ టాలెంటెడ్ గా మారుతోంది.

తండ్రి మహేశ్ బాబు గురించి..
సితార ఘట్టమనేని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో తన తండ్రి మహేశ్ బాబు గురించి కొన్ని విషయాలను చెప్పింది. తన తండ్రికి పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఇంట్లో చాలా సింపుల్ గా ఉంటారని, ఎంతో ఫ్రెండ్లీగా, సరదాగా తమతో సమయం గడుపుతారని తెలిపింది. ఇక తన తండ్రి నటించిన చిత్రాల్లో మురారి చిత్రం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఆ సినిమాను ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుందని చెప్పింది. ఇక తనకు వంట చేయడం పెద్దగా రాదని, తన తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా వంట చేయదని చెప్పుకొచ్చింది. తనకు మ్యాగీ అంటే ఇష్టమని తెలిపింది.
సేవలో తండ్రికి తగ్గ తనయ..
మహేశ్ బాబు కొన్నాళ్లుగా చిన్నారులకు ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఎంబీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సితార ఘట్టమనేని కూడా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. ఆ మధ్యలో తను నటించిన ఇంటర్నేషనల్ బ్రాండ్ PMJ జ్యూయెల్లరీకి 1 కోటీ రూపాయాల పారితోషికం తీసుకుంది. ఆ డబ్బును పేదలకు సహాయార్థం అందించి ప్రశంసలు అందుకుంది.
మహేశ్ బాబు బిజీ..
సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. SSMB 29గా వర్క్ టైటిల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూ.1000 కోట్లతో నిర్మిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ ఫిల్మ్ ను చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి వర్క్ చేస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











