సీతారామం దర్శకుడికి మరో గోల్డెన్ ఛాన్స్.. మైత్రి వారితో బిగ్ పాన్ ఇండియా ప్లాన్!
మంచి లవ్ స్టోరీలను తెరపైకి తీసుకువచ్చే తెలుగు దర్శకులలో హను రాగవపూడి ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మంచి ఎమోషన్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందాల రాక్షసి సినిమా ద్వారా దర్శకుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన హను రాఘవపూడి ఆ తర్వాత మళ్లీ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు. ఇక మొత్తానికి అతను గత ఏడాది ఎంతో హార్డ్ వర్క్ చేసి సితారామమ్ అనే కథను తెరపైకి తీసుకువచ్చాడు.
దుల్కర్ సల్మాన్ మృనాల్ ఠాగూర్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. రష్మిక మందన్న ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ఆ సినిమా ద్వారా దర్శకుడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే సితారమం సినిమా తర్వాత వెంటనే హను రాఘవపూడి మరో సినిమాను కూడా మొదలు పెట్టాలని అనుకున్నాడు.

కానీ ఎందుకో అతని తదుపరి ప్రాజెక్టు విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోవడం లేదు. గతంలో అయితే రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా టాక్ అయితే వినిపించింది. కానీ అందులో నిజం లేదని కూడా ఆ తర్వాత వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చి కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపు ఒక కథను పూర్తి చేసిన దర్శకుడు హీరోకు కూడా త్వరలోనే వినిపించే అవకాశం ఉన్నట్టు టాక్. ఒక తమిళ స్టార్ హీరో తోనే ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేయాలి అని మైత్రి మూవీ మేకర్స్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక హను రాగవపూడి చెప్పిన కథ అతనికి నచ్చితే ఓకే చేసే అవకాశం ఉండవచ్చు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











