బ్రహ్మానందమే ఆ డబ్బు తిన్నారా?

కానీ బ్రహ్మానందం తనకు పేరు రావడం లేదని తనపై విమర్శల దాడి చేశారని వాపోయారు. తన డబ్బంతా తానే స్వకార్యాలకు వినియోగిస్తున్న తరుణంలో.. రేలంగి విగ్రహం చందా డబ్బును తినేశానని వెల్లువెత్తిన ఆరోపణలు అసత్యమని శివాజీ రాజా నొక్కి చెప్పారు.అలాగే ఆ డబ్బంతా.. బ్రహ్మానందం దగ్గరే ఉన్నాయని, అప్పటికే నాలుగు లక్షలు పోగయ్యాయని శివాజీ రాజా వెల్లడించారు.
కావలసినంత చందా పోగైనప్పటికీ రేలంగి విగ్రహ ప్రతిష్ట కార్యరూపం దాల్చలేదని, దీనికి బాధ్యుడు బ్రహ్మానందమేనని శివాజీ రాజా తెలిపారు. అప్పుడే తాను ప్రెస్‌మీట్ పెట్టి చెప్పానని అయినా ఫలితం లేదని అన్నారు. అంతేగాక తనను ముందుకు తోసిన తోటి హాస్య నటులు ఎవరూ ఆ ఫ్రెస్ మీట్ లో కనపడకపోవటం విశేషమని ఆవేదనగా అన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా రేలంగి విగ్రహం సంగతి తేలిస్తే బాగుండును.
movies telugu brahmanandam sivaji raja relanghi mallikarjunarao శివాజి రేలంగి బ్రహ్మానందం మల్లికార్జునరావు


Click it and Unblock the Notifications