»   » అతి చేసే హీరోయిన్లు వాళ్ళిద్దరేనా.. రాంచరణ్, దాసరి గొడవ మళ్ళీ రిపీట్..?

అతి చేసే హీరోయిన్లు వాళ్ళిద్దరేనా.. రాంచరణ్, దాసరి గొడవ మళ్ళీ రిపీట్..?

Subscribe to Filmibeat Telugu
అతి చేసే హీరోయిన్లు వాళ్ళిద్దరే, రాంచరణ్, దాసరి గొడవ

మా అసోసియేషన్ మీటింగ్ సందర్భంగా ఇటీవల శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేసారు. తమకు సహకరించని హీరోయిన్ల తోకలు కత్తిరించాల్సి ఉంటుందని శివాజీ రాజా హెచ్చరికలు జారీ చేసాడు. ఈ వ్యవహారం టాలీవుడ్ లో చిన్న పాటి అలజడినే సృటించింది. కాగా శివాజీ రాజా ఏ హీరోయిన్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు అని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

 టాలీవుడ్ లో కోట్లు దండుకుంటారు కానీ..

టాలీవుడ్ లో కోట్లు దండుకుంటారు కానీ..

టాలీవుడ్ నిర్మాతల నుంచి హీరోయిన్లు కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. కానీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రం కొందరు ఏమాత్రం సాయం చేయడం లేదని అర్థం వచ్చేలా శివాజీ రాజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 గతంలో దాసరి ఇదేతరహా వ్యాఖ్యలు

గతంలో దాసరి ఇదేతరహా వ్యాఖ్యలు

స్వర్గీయ దాసరి నారాయణ రావు గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు తప్ప చిత్ర పరిశ్రమకు సంబందించిన ఈవెంట్ లకు హాజకారని మండి పడిన సంగతి తెలిసిందే.

 రచ్చగా మారిన చరణ్ కౌంటర్

రచ్చగా మారిన చరణ్ కౌంటర్

దాసరి వ్యాఖ్యలని అప్పట్లో రామ్ చరణ్ ఖండించారు. ఈ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద రచ్చగా మారింది. మెగా కాంపౌండ్ మరియు దాసరి వర్గీయముల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆ తరువాత గొడవ సద్దుమణిగింది.

 శివాజీ రాజా టార్గెట్ ఆ ఇద్దరు హీరోయిన్లేనా

శివాజీ రాజా టార్గెట్ ఆ ఇద్దరు హీరోయిన్లేనా

తోకలు కత్తిరించాల్సి ఉంటుందని శివాజీ రాజా మరో హీరోయిన్లని ఉద్దేశించిన ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనే చర్చ జరుగుతోంది. శివాజీ రాజా టార్గెట్ కాజల్ అగర్వాల్ మరియు తమన్నా అని టాక్. ఎందుకంటే పేమెంట్ లేనిదే ఏ కార్యక్రమానికి కూడా వీళ్ళిద్దరూ ముందుకు రారని టాక్ ఉంది. కనీసం సోషల్ మీడియాలో పోస్టులకు కూడా పైసా వసూల్ కావాలసిందేనట.

English summary
Sivaji Raja sensational comments on heroines became hot topic in Tollywood. Sivaji Raja indirectly targets those two heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu