హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. నిర్మాతగా యువ హీరో?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకున్నాడు అనిరుధ్ రవిచంద్రన్. చిన్న వయసులోనే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా జనాల్లో మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా అనిరుధ్ కి మంచి క్రేజ్ అందుతోంది. ఇకపోతే ఈ యువ సంచలనం హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట.

ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ హీరోగా మంచి విజయాల్ని అందుకుంటున్నాడు. బిచ్చగాడు సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జీవి. ప్రకాష్ కుమార్ కూడా కొన్ని సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు అదే తరహాలో అనిరుధ్ కూడా తన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించాలని కష్టపడుతున్నారు. ఇకపోతే అతని మొదటి సినిమాను తమిళ్ యువ హీరో శివ కార్తికేయన్ నిర్మించబోతున్నాడు.

Sivakarthikeyan is planning to produce a film with anirudh ravichander

వీరి కలయికలో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. బెస్ట్ మ్యూజికల్ కాంబో అనేలా క్రేజ్ తెచ్చుకున్న ఈ కాంబినేషన్ ఈ సారి డిఫెరెంట్ గా కలిసి పని చేయబోతోంది. శివ కార్తికేయన్ తన సొంత ప్రొడక్షన్ లోనే అనిరుధ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని ఇప్పటికే కోలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X