20కోట్లు కొల్లగొట్టిన సినిమా కోసం రాజశేఖర్, దర్శకుడి మధ్య గొడవలు.. రంగంలోకి దిగిన జీవిత
జీవిత రాజశేఖర్ అంటే తెలియని తెలుగు ఆడియేన్స్ ఉండరు. ఈ స్టార్ కపుల్స్ అప్పట్లో బిగ్ స్క్రీన్ పై బాక్సాఫీస్ రికార్డులను సృష్టించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత జీవిత వెండితెరపై కనిపించకపోయినా కూడా దర్శకురాలిగా నిర్మాతగా బాగానే రానిస్తున్నారు. అయితే చాలా కాలం తరువాత మళ్ళీ జీవిత తన భర్త సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంలో ఒక రూమర్ హాట్ టాపిక్ గా మారింది.

ఆ సినిమాతో సెట్టయ్యారని అనుకుంటే
సీనియర్ హీరో రాజశేఖర్ గతంలో మాదిరిగా వేగంగా అయితే సినిమాలు చేయడం లేదు. వరుస అపజయాల కారణంగా కాస్త స్లోగా సినిమాలు చేయాల్సి వస్తోంది. చివరగా గరుడ వేగ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే విదంగా హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో సెట్టయ్యారని అనుకుంటే 2019లో వచ్చిన కల్కి సినిమా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.

20కోట్లకు పైగా అందించిన సినిమాతో..
ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకోవాలని రాజశేఖర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మలయాళం హిట్ మూవీ జోసెఫ్ కథను లైన్ లోకి తీసుకువచ్చారు. 2018లో మళయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ క్రైమ్ థ్రిల్లర్ ను 4కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 20కోట్లకు పైగా లాభాలను అందించింది.

తప్పుకున్న దర్శకుడు
ఇప్పుడు జోసెఫ్ కథను కూడా అదే తరహాలో తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. రాజశేఖర్. 2019 నుంచి సినిమా సెట్స్ పైనే ఉంది. అయితే మొదట డైరెక్టర్ నీలకంఠను ఫిక్స్ చేసినప్పటికీ స్టోరీ స్క్రీన్ ప్లే విషయంలో విబేధాలు రావడంతో దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఆల్ మోస్ట్ సెట్టయ్యిందని అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే రూమర్స్ చాలానే వచ్చాయి.
Recommended Video

దర్శకురాలిగా జీవిత
అయితే హీరో రాజశేఖర్ ఈ ప్రాజెక్టును జీవితకు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. మరోసారి సతీమణి దర్శకత్వంలోనే రాజశేఖర్ నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. గతంలో శేషు, ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, సత్యమేవజయతే, మహంకాళి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన జీవిత 6వ సారి కూడా రాజశేఖర్ ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. మరి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











