Ram Pothineniకి పెద్ద కష్టం.. తమన్ చేసిన పనికి ఇరకాటంలో రామ్
తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ది వారియర్ సినిమాతో ప్లాప్ తెచ్చుకున్న రామ్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే బోయపాటి శ్రీనుతో స్కంద, పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన పనికి రామ్ పోతినేని పెద్ద కష్టంలో పడాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న న్యూస్. ఇంతకీ తమన్ ఏం చేశాడనే విషయంలోకి వెళితే..
సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే దేవదాస్ తర్వాత జగడం, రెడీ, మస్కా వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ లో నడిచాడు రామ్ పోతినేని. హ్యాండ్సమ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణించాడు రామ్ పోతినేని. ఎక్కువగా లవర్ బాయ్ స్టోరీలు చేసిన రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం రెడీ అయ్యాడు. లైగర్ తర్వాత రామ్ కు స్టోరీ లైన్ చెప్పడం, స్క్రిప్ట్ వినిపించడంతోపాటు ఓకే అనేలా చేసుకున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్.

డబుల్ ఇస్మార్ట్ సెట్ లోకి వచ్చిన రామ్ పోతినేని మేకోవర్ కూడా మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఇదే సమస్యగా మారింది. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న స్కంద సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. దీన్ని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకు ఓ పాటను తమన్ ఆలస్యంగా ఇచ్చాడట. ఆ పాట నచ్చకపోవడంతో ఇంకాస్త ఆలస్యం అయిందని టాక్. ఈలోపే డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ పోతినేని లుక్ మార్చేసుకున్నాడు.
ఇప్పుడు స్కంద మూవీలో పాట షూటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయిందట. మరి రామ్ ఇప్పుడు ఏం చేస్తాడు..? బోయపాటి ఏం ఆలోచిస్తారు? అనేది తెలియడం లేదు. ఈ పాటకోసం ఇస్మార్ట్ లుక్ నుంచి స్కంద లుక్ లోకి రావడం రామ్ కు చాలా కష్టమైన పని. డబుల్ ఇస్మార్ట్ లుక్ లోనే స్కంద పాటను పూర్తి చేస్తారా? ఇంకేదైనా ఆలోచిస్తారా? అనేది తెలియాలి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇకపోతే తమన్ ఇప్పటికే అనేక ప్రాజెక్ట్సుతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు బ్రో సినిమాకు కూడా ఇలానే చివరి నిమిషంలో పాటను రెడీ చేసి ఇచ్చాడట తమన్. మొత్తానికి తమన్ చేసిన పనికి రామ్ మేకోవర్ లుక్ కోసం కష్టపడాల్సి వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











