ప్రిన్స్ మహేష్ బాబు స్కిన్ ఎలర్జీతో ఇబ్బందిపడటం వల్లే వరుడు షూటింగ్ లేటయిందనే వార్త ఇప్పుడు అంతటా వినపడుతోంది.కథ పూర్తి కాలేదని, హీరోయిన్ సెట్ కాలేదని, ఫ్యామిలీ సమస్యలని కొన్ని రీజన్స్ వినపడ్డా నిజం ఇదేనని అంటున్నారు. అయితే ముఖంపై రాషెష్ మాత్రం వచ్చాయని, అదీ ఆ మధ్య యాడ్ ఫిలిం షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం సెట్ కాక అని కొందరు కొట్టిపడేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఎలర్జీ లేదని, పూర్తిగా తగ్గి ముఖం మునపటి కన్నా గ్లో ఎక్కువయిందని అతని పరిచయస్ధులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. త్వరలోనే బ్యాంకాక్ కి వెళ్ళనున్నారు. అలాగ ఈ చిత్రం నిర్మాణంలో మేజర్ షేర్ కూడా మహేష్ దే నని కన్ఫర్మ్ గా చెప్తున్నారు. ప్రాజెక్టు బాగా లేటవటంతో నిర్మాత శింగనమల రమేష్ పడిన ఇబ్బందిని గమనించిన మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే సంగతి తెలిసిందే.
Story first published: Thursday, June 4, 2009, 10:17 [IST]