వివాదంలో భరత్ అనే నేను నిర్మాత.. కైరా అద్వానీ, కొరటాల ఇద్దరికీ.. చరణ్ సినిమాతో అయినా!

Recommended Video

Koratala Siva And Kiara Advani Face Payment Issues With DVV Danayya

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేనుగా సమ్మర్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. మహేష్ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించిన స్నాగతి తెలిసిందే. శ్రీమంతుడు తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన రెండవ చిత్రం ఇది. భరత్ అనే నేను చిత్రం 90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ కైరా అద్వానీ నటించిన తొలి టాలీవుడ్ చిత్రం భరత్ అనే నేను. దర్శకుడు కొరటాల శివ, కైరా అడ్వాణీకి పేమెంట్ విషయంలో స్వల్ప వివాదం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికలో కథనం వెలువడింది.

 కొరటాలకు ఇప్పటికీ

కొరటాలకు ఇప్పటికీ

డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు కొరటాల శివకు ఇంకా పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ సున్నిత మనసున్న వ్యక్తి. ఈ విషయంలో గందరగోళం సృష్టించడం ఆయన ఇష్టం ఉండదని సన్నిహితులు చెబుతున్నారు.

తగ్గిన ఆసక్తి

తగ్గిన ఆసక్తి

డివివి దానయ్య బడా చిత్రాల నిర్మాత. కొరటాల శివ టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయారు. వీరి కాంబినేషన్ లో మరో చిత్రం వచ్చే అవకాశం ఉందని భావించడంలో తప్పు లేదు. కానీ దానయ్య తీరుతో కొరటాల అసంతృప్తిగా ఉన్నారట. పారితోషకం ఆలస్యం చేస్తుండడంతో ఆయన నిర్మాణంలో మరో చిత్రం చేయడానికి కొరటాల ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి.

కైరా తొలి చిత్రానికే

కైరా తొలి చిత్రానికే

కైరా అద్వానీకి భరత్ అనే నేను చిత్రంతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమెకు పారితోషకం విషయంలో చిక్కులు తప్పడం లేదట. కైరా అద్వానీకి కూడా దానయ్య ఇంకా పూర్తి పారితోషకం ఇవ్వలేదని విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది.

రాంచరణ్ సినిమాతో అయినా

రాంచరణ్ సినిమాతో అయినా

కైరా అద్వానీ వరుసగా రెండవ సారి దానయ్య నిర్మాణంలోనే నటిస్తోంది. రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్. ఏ ఈ చిత్రం కూడా పూర్తయ్యాక రెండు చిత్రాలకు కలిపి పూర్తి రెమ్యునరేషన్ అందిస్తానని కైరాకు నిర్మాత నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది.

భారీ మల్టీస్టారర్

భారీ మల్టీస్టారర్

రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ క్రేని కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి కూడా దానయ్య నిర్మాత కావడం విశేషం. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X