తినగ తినగ వేము తియ్యగ నుండు!
సినిమా రంగంలో వారసత్వాల గురించి ఎంత మంది మొత్తుకున్నా వాళ్ల పరంపర మాత్రం ఆగడం లేదు. జనం మీదకు వాళ్లని పదేపదే రుద్దితే ఆదరించకుండా ఉండరు. 'తినగ తినగ వేము తియ్యగ నుండు". అనే సూక్తి ప్రకారం వారసులూ సెటిలైపోతున్నారు. 'అల్లరి నరేష్" ప్రఖ్యాత దర్శకుడు ఇవివి కుమారుడు కావడంతో సినిమాల్లోకి రావడం నల్లేరు మీద హోండాసిటి కారులా సాగిపోతుంది. నలుగు ప్లాప్ లు, ఒక హిట్. అలా సాగిపోతున్న హీరో నరేష్ రెమ్యునరేషన్ కోటి రూపాయల్లోపే ఉండటంతో మిడిల్ క్లాస్ నిర్మాతలకు వరంలా తోస్తున్నాడు.
ప్రస్తుతం నరేష్ తో కలాతపస్వి కె విశ్వనాథ్ ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో 'శంకరాభరణం" లాంటి వరల్డ్ క్లాసిక్ సినిమా ఇచ్చిన కె విశ్వనాథ్ కి పెద్ద హీరోలు అందుబాటులో లేకపోవడంతో నరేష్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా'వంశీ" కూడా నరేష్ తో ఇంకో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఆయన తీసిన 'గోపి గోపిక గోదావరి" తీరం అంతంతమాత్రంగానే ఆడింది. ఈ సారి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఓ తీస్తున్న శంశీకికి నరేష్ అందుబాటులో ఉండటమే కారణం తప్ప అతను గొప్ప నటుడని కాదు. ఇలా ఇప్పుడు పాత దర్శకులకు ఒకటీ ఆరా సినిమాలొస్తున్న టైంలో నరేష్ హీరోగా తన ప్రతిభను చాటుకొంటే భవిష్యత్లో మంచి నటుడిగా మిగిలిపోగలడు.


Click it and Unblock the Notifications











