స్నేహ ప్రేమాయణం అమెరికా

స్నేహ తెలివిగా నాకేమి తెలియదన్నట్లు కొన్నాళ్ళు ఆ విషయం ఎత్తకుండా ( అతని కాల్స్ మాత్రమే ఎత్తుతోందిట) గడుపుకొచ్చిందిట. అయితే అ మధ్య వాళ్ళిద్దరూ యు.ఎస్ లో ప్రత్యక్షమయ్యారు (పాండురంగడు అమిరికా యాత్ర టైమ్). ఇద్దరూ కలసి షాపింగ్ లకు వెళ్ళటం,రెస్టారెంట్ లో డిన్నర్స్ అవీ భారీగానే చేసారుట. అలాగే ఓ రోజు హఠాత్తుగా స్నేహ మిస్సైపోవటం ఆమెను రిసీవ్ చేసుకున్న వారంతా కంగారుపడటం...చూస్తే ఆమె సెల్ కూడా కట్టేసి ఉండటం కూడా జరిగిందిట. తెలివైన వాళ్ళు కొందరు ప్రసన్న అక్కడ దిగిన హోటల్ ఎడ్రస్ ద్వారా ఆమెను ఎంక్వైరీ చేసి హమ్మయ్య అనుకున్నారుట. అలా అక్కడ జరిగిన వార్తలు తర్వాత ఒకదాని తర్వాత మరొకటి తమిళ మీడియా ద్వారా బయిటపడటం జరిగింది.
ఈ లోగా కొందరు ఉత్సాహవంతులు అయితే ఆమెని ఆ విషయం అడుగుతూ ఇంటర్వూ చేయటం చకచకా జరిగిపోయాయి. దాంతో ఆమె రెచ్చిపోయిన స్నేహ "ఎస్ .మేమిద్దరం కలసి షాపింగ్ కి వెళ్ళాం...కలిసి కొన్ని ప్రదేశాలు చుట్టి వచ్చాం ... అంతమాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లేనా...?" అంది. సర్లే గానీ బాపూ బొమ్మ అతన్నే పెళ్ళి చేసుకోకూడదూ అంటే...దానికి ఇంకా టైముంది అంది. "పెళ్ళికా...ప్రసన్నతో పెళ్ళికా..."అనే విషయం క్లారిఫై చేసుకునే లోపల లేచి వెళ్ళిపోయింది. ఇంతలో ఆమె పర్శనల్ వచ్చి అందరికీ టీ లిచ్చి స్నేహా మేడంకి ఒంట్లో బాగోలేదు...తర్వాత కూల్ గా ఓ రోజు మిమ్మల్ని సావకాశంగా పిలుస్తా....ఎక్కువ సేపు ఇంటర్వూ తీసుకుందిరి గాని అని పంపించేసారుట.


Click it and Unblock the Notifications











