'ఎస్.ఎమ్.ఎస్' హీరోయిన్ మెదలెట్టేసింది
సుధీర్ బాబు చిత్రం ఎస్.ఎమ్.ఎస్ తో పరిచయమైన రెజీనా ఒక్క సినిమా హిట్టుకే రెమ్యునేషన్ పెంచి డిమాండ్ చేయటం మొదలెట్టేసిందని టాక్. హీరో కన్నా ఆమెకు ఎక్కువ మార్కులు పడటం, అందరూ ఆమె గురించే పొగడటంతో ఆమె ఒక్కసారిగా రేటు పెంచి షాక్ ఇస్తోందంటున్నారు. ఆమె రేటు శ్రియ,త్రిష ల రేంజిలో ఉండటం ఆమెను ఎప్రోచ్ అయ్యిన నిర్మాతలను అబ్బురపరుస్తోందని చెప్తున్నారు.
ఇక రెండు వారాల క్రితం ఈ చిత్రం విడుదలైంది. మహేష్ బావగా సుధీర్ బాబు ఈ చిత్రం ప్రమోట్ చేసుకున్నారు. తాతినేని సత్య దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రం తమిళ చిత్రం రీమేక్. అక్కడ హీరోయిన్ కన్నా ఈమే బాగా చేసిందని ,జూనియర్ ఇలియానాలాగ ఉందని ఫిల్మ్ ఫీల్డులో మార్నింగ్ షో కే గుప్పుమనటం ప్లస్ అయ్యింది. దానికి తోడు మీడియా కూడా పదే పదే ఆమెనే చూపుతూ,ఆమె ఇంటర్వూలు వేస్తూ హైలెట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె తను దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్టుతో రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోంది. ఇక ఈ తమిళ భామ చిన్నప్పటినుంచీ మోడిలింగ్ ఫీల్డులో ఉండటం కూడా బాగా కలిసి వచ్చిన అంశం.


Click it and Unblock the Notifications











