విష్ణు 'సలీం' చిత్రంపై కుళ్లు 'ఎస్.ఎమ్.ఎస్'
విష్ణు, ఇలియానా కాంబినేషన్లో వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న 'సలీం' చిత్రంపై ఓ ఎస్.ఎమ్.ఎస్ జోక్ పాపులర్ అయింది. ఆ జోక్ ఇలా ఉంది...సినిమా కనిపెట్టాక..రెండు సినిమా శకాలు నడిచాయి. అవి 'మూకీ' యుగం..'టాకీ' యుగం. అయితే లేటెస్టుగా సలీం రిలీజ్ అనంతరం మరో యుగం మొదలయ్యింది. అది 'పాకీ' యుగం. అంటూ ఇంగ్లీష్ లో ఎస్.ఎమ్.ఎస్ లు ఒకర్నించి మరొకరుకి పంపుకుంటున్నారు. మూకీ..టాకీ..పాకీ అనే రైమింగ్ ఆదారంగా ఈ జోక్ తయారైంది. ప్రేక్షకులకు ఓ రేంజిలో టార్చర్ పెట్టడంలో ఈ సినిమా సఫలీకృతమవ్వటంతో ఈ రకంగా ఈ చిత్రం చూసిన వారు తమ భాధను వ్యక్తం చేసుకుంటున్నారు. అలాగే దర్శకుడు వైవియస్ చౌదరి అంతకు ముందు చిత్రం 'ఒక్క మగాడు' ను మించి రికార్డులు బ్రద్దలు కొట్టాడని వ్యంగ్యంగా చెప్పుకుంటున్నారు. ఏదైమైనా సినిమా వాళ్ళను మించిపోయే క్రియోటివిటీ బయిట ఉందనటంలో సందేహం లేదు.
సలీం విష్ణు మోహన్ బాబు ఇలియానా వైవియ్ చౌదరి దేవదాసు ఒక్క మగాడు బాలకృష్ణ saleem vishnu mohan babu ileana yvs chowdary devadas okka magaadu


Click it and Unblock the Notifications