'SMS' సుధీర్ బాబు నెక్ట్స్ ఆ డైరక్టర్ తో...
ఎస్.ఎమ్.ఎస్ చిత్రంతో పరిచయమైన సుధీర్ బాబు తదుపరి చిత్రం ఖరారైంది. రక్ష చిత్రంతో పరిచయమైన వంశీ కృష్ణ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత ఆ చిత్రాన్ని నిర్మించనున్నారు. గత మూడు నెలలుగా ఈ చిత్రానికి సంభందించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చి ఓకే అయినట్లు చెప్తున్నారు. కృష్ణ అల్లుడుగా పరిచయమైన సుధీర్ బాబు ఈ చిత్రంలో తన డాన్స్ లు,ఫైట్స్ తో పేరు తెచ్చుకున్నారు. తమిళ రీమేక్ గా రూపొందిన ఆ చిత్రం యావరేజ్ గా సెటిలైంది.
సుధీర్ బాబు తన దృష్టిని యాక్షన్ ఎంటర్టైనర్స్ పైన పెడుతున్నారు. అటువంటి కథలంటేనే ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో తను యాక్షన్ హీరోగా సెటిలవుతానని ఆశగా ఉన్నారు. వంశీ కృష్ణ సైతం తనపై పడ్డ హర్రర్ ముద్రను చెరిపేసుకుని ఈ చిత్రంతో మెయిన్ స్ట్రీమ్ దర్శకులలో కలవాలనుకుంటున్నారు. వర్మ శిష్యుడైన వంశీ కృష్ణ అప్పల రాజు చిత్రానికి సైతం స్క్రిప్టు డిపార్టమెంట్ లో పనిచేసారు.


Click it and Unblock the Notifications











