బాలకృష్ణ నోటీసుకు స్నేహ రిప్లయ్ ఏమిచ్చిందంటే....
స్టార్ నైట్ పోగ్రామ్ లో పాల్గొనలేదంటూ స్నేహ,నయనతారలకు బాలకృష్ణ కన్వీనర్ హోదాలో నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే నయనతార ఇప్పటివరకూ తాను ఎందుకు పాల్గొనలేదో వివరించలేదని సమాచారం. అయితే స్నేహ మాత్రం రిప్లయ్ ఇచ్చింది. అందులో తనకు ఫ్లూ జ్వరం రావటం వల్లనే స్టార్ నైట్ కు అటెండు కాలేకపోయానని,అంతకు మించి మరేమీ లేదని క్షమాపణ పూర్వకంగా కోరింది. దాంతో స్టార్ నైట్ కార్యవర్గం సరేనన్నారు. ఆమె బాధని సానుభూతితో అర్ధం చేసుకున్నామని తెలిపారు. ఇక నయనతార రాకపోవటం, రిప్లై ఇవ్వకపోవటంతో చాలా కోపంగా ఉన్నారు. అయితే ఇంతకుముందు తమిళ పరిశ్రమలో నిర్మాతల మండలి పయ్యా చిత్రం విషయమై బ్యాన్ పెడతానన్నప్పుడు కూడా ఆమె అటెండు కాలేదు. ఆ విషయాలను స్టార్ నైట్ కార్యనిర్వాహక వర్గం గుర్తు చేసుకుంటోందని,ఆమెపై ఏ విధమైన చర్య తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నయనతార ..ఎన్టీఆర్ సరసన అదుర్స్ లో చేస్తోంది. ఆమెను సపోర్టు చేసేందుకు తెలుగు పరిశ్రమలో చాలా మంది ఉన్నారనేది నిజం. కాబట్టి ఏ విధమైన వేటు పడకపోవచ్చునని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











