బట్టలు విప్పడానికి ఇష్టపడని స్నేహ!
సౌందర్య మరణించిన తర్వాత ఆ లోటును పూర్తి చేస్తూ తెలుగింటి ఆడపడుచులా ఉంటూ అంతటి పేరు సంపాదించుకున్న తార 'స్నేహ". చక్కగా చీర కట్టుకుని క్యూట్ గా వుంటూ ప్రేక్షకులను రంజింప జేస్తూ నటిస్తున్న స్నేహ మొట్టమొదటి సారిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది.
'భవాని ఐపియస్" అంటూ పోలిసాఫీసర్ పాత్రలో నటిస్తున్న స్నేహా ఆ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని చెప్తుంది. అంతే కాదు తను వేసుకున్న ఖాకీ డ్రస్సు చూసి నిజంగా పోలీసులానే భావించి కర్తవ్యం చేస్తుందట. అంతేకాదు, నిజంగా పోలీసు అని భావించి ఆలో వాళ్లు సెల్యూట్ చేస్తున్నారంటా. ఇది గమనించిన స్నేహ నేను యాక్టింగ్ ఫీల్డ్ కు రాకుండావుంటే పోలీస్ అయ్యేదాన్ని అంటూ షూటింగ్ లోని వారికి వినిపిస్తుందట. షూటింగ్ తర్వాత డ్రస్సు తీయ్యడానికి కూడా ఇష్ట పడటం లేదట. దీంతో నిర్మాత తనకు సెపరెట్ గా ఓ పోలీస్ యూనిఫాంను కొనిచ్చాడట. దాంతో సంతృప్తి పడిన స్నేహ, షూటింగ్ కు వచ్చేటప్పుడు ఆ డ్రస్సు వేసుకునే వస్తుందని సమాచారాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











