పెళ్లికి ముందే స్నేహ గర్భవతిగా?
హీరోయిన్ స్నేహ త్వరలో తన తోటి నటుడు ప్రసన్నతో పెళ్లికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మే 11న వీరి వివాహం జరుగబోతోంది. కాగా... పెళ్లి ముందే స్నేహ గర్భవతిగా మన కళ్ల ముందుకు రాబోంది. అయితే రియల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్‌లో. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన 'కహానీ'చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. గర్భవతి అయిన కథానాయిక, ఉపాధి నిమిత్తం నగరానికి వెళ్లిన తన భర్త తిరిగి రాకపోవడంతో... అతన్ని వెదుక్కుంటూ అక్కడికి వెళుతుంది. అక్కడామెకి ఎదురయ్యే పరిస్థితులే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది.
హిందీలో విద్యా బాలన్ పోషించిన పాత్రకి ఫ్యామిలీ నటి స్నేహ మాత్రమే న్యాయం చేయగలదనే ఉద్దేశంతో, ఆ పాత్రకి ఆమెని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది పెళ్ళికి ఈ ప్రాజెక్టు మొదలువుతుందా? లేక పెళ్లి తర్వాత మొదలవుతుందా? అనేది మాత్రం తేలాల్సి ఉంది.
అచ్చముండు, అచ్చముండు సినిమాలో కలిసి నటించినప్పుడు స్నేహ, ప్రసన్న మధ్య ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిన విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. చాలా తక్కువ సమయం ఉండటంతో ఇద్దరూ సినిమా పనులు పక్కన పెట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు.


Click it and Unblock the Notifications











