Allu Arjun: అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి కండిషన్.. ఆ హీరోయిన్‌తో నటించొద్దంటూ..!

అల్లు అర్జున్... ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే తన ప్రేయసిని పెళ్లాడి ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్నేహారెడ్డితో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న అల్లు అర్జున్.. 2011లోనే పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇక పెళ్లి చేసుకున్నాక.. ఎంత అర్ధం చేసుకున్నా పార్టనర్ దొరికినా... కొన్ని విషయాల్లో భార్య కండిషన్స్ తప్పవు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు తన భార్య స్నేహ రెడ్డి ఓ విషయంలో కండిషన్ పెట్టిందట. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు స్నేహరెడ్డి.. బన్నీకి ఏ విషయంలో కండిషన్ పెట్టింది.. ఎందుకు పెట్టాల్సి వచ్చింది... మరి దానికి బన్నీ ఒప్పుకున్నాడా లేదా అనేది ఈ స్టోరీలో చూద్దాం.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్... మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో 2021 డిసెంబర్ లో పుష్ప సినిమాతో వచ్చి సంచలనం సృష్టించి.. గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప.. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రానికి సీక్వేల్ తెరకెక్కించే పనిలో పడ్డారు మేకర్స్. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

 Sneha Reddy condition to Icon Star Allu Arjun not to act with that heroine Full Details Here

ఇక పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ లైనప్ చూసుకుంటే... సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు. ఎందుకంటే సందీప్ వంగా... రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా సీక్వెల్ యానిమల్ పార్క్, ఆ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాలు చేయాలి. ఆ తర్వాతే.. అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది బన్నీ.

అయితే బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే.. జులైయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. చిత్రాలు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు నాలుగవ చిత్రం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో యానిమల్ సినిమాతో ఫేమస్ అయిన బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక యానిమల్ చిత్రంలో బోల్డ్ సీన్స్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతుందట.

 Sneha Reddy condition to Icon Star Allu Arjun not to act with that heroine Full Details Here

ఈ విషయం తెలుసుకున్న స్నేహరెడ్డి... బన్నీకి కండిషన్స్ పెట్టిందని సమాచారం. ఆమెతో నువ్వు నటించవద్దని కండిషన్ పెట్టిందట. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. భర్త నటుడు... అయినప్పుడు ఎవరితోనైనా నటించాల్సి వస్తుంది.. ఇలా స్నేహరెడ్డి కండిషన్ పెట్టడం ఏంటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది.. స్నేహరెడ్డి నిర్ణయం కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 Sneha Reddy condition to Icon Star Allu Arjun not to act with that heroine Full Details Here

ఏది ఏమైనా ఈ న్యూస్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ఉంటుందో లేదో కూడా డౌటే. గుంటూరు కారం ఎఫెక్ట్ తో ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ అంటూ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఇక ఎన్టీఆర్, పవన్, మహేష్, బన్నీలను వదిలేసి.. టైర్ 2 హీరోలను పట్టుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లతో సినిమాలు తీయనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X