జెనీలియా, శ్రియలకు తల్లిగా నటిస్తావా అంటే? తల్లి పాత్రలకు ససేమిరా...?
ముద్దమందార తార స్నేహ తను అమ్మ పాత్ర పోషించబోతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవంలేదని తోసిపుచ్చింది. అమ్మ పాత్రల్లో కనిపించేటంత వయసుగాని, ఆ అవసరముగానీ, తనకు లేదని స్పష్టం చేశారు. అయితే మలయాళ చిత్రంలో అమ్మలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయే అని అడిగితే...అదంతా శుద్ధ అబద్ధమని కొట్టి పారేసింది.
మోహన్‌లాల్ హీరోగా 'షికార్"అనే మలయాళ చిత్రంలో ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటిస్తున్నానంది. ఆ చిత్రంలో మోహన్ లాల్ ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాడు...అది కూడా సినిమాలో నా పాత్ర మరణించిన తర్వాత మాత్రమే. కనుక ఆ అమ్మాయికి అమ్మగా నటించే అవకాశమే లేదని తేల్చి చెపుతోంది. ఇదిలావుంటే ఇటీవల దర్శకుడు కె.ఎస్.రవికుమార్ స్నేహను సంప్రదించి శ్రేయకు అమ్మగా నటించమని అడిగాడట. రవి కుమార్ మాటలకు కొండత కోపం వచ్చినప్పటికీ ఎంతో నేర్పుతో సున్నితంగా తను తల్లి పాత్రలో నటించనని చెప్పేసిందట.


Click it and Unblock the Notifications











