బాలయ్యతో రొమాన్స్ ఫలించలేదని హీరోయిన్ భాధ
బాలకృష్ణ సరసన సింహా చిత్రంలో రొమాన్స్ పండించిన స్నేహా ఉల్లాల్ కి ఆ చిత్రం విజయం ఏ మాత్రం కలిసి రాలేదని చెప్తున్నారు. ఆ చిత్రం హిట్టయ్యాక ఏ నిర్మాణ సంస్ధ ఆమెను పిలిచి సినిమా ఆఫర్ చేయలేదని చెప్తున్నారు. దాంతో స్నేహా ఉల్లాల్ తీవ్రమైన ఆశా భంగంతో ఉందని అంటున్నారు.అప్పటివరకూ అరకొరగా ఉన్న అవకాశాలు రెట్టింపు అవుతాయని, పెద్ద హీరోల సరసన కంటెన్యూ ఆఫర్స్ వస్తాయని ఆమె ఆశించింది. అయితే అదేమీ జరగకపోవటమే కాక అస్సలు ఆఫర్స్ రాకుండా పోయాయి. దాంతో సింహా చేయటానికి ముందే మేలని ఆమెకు వరసగా ఏదో చిన్నా పెద్దో ఆఫర్స్ వచ్చేవని, ఇప్పుడు పెద్ద హీరో ప్రక్కన చేయటంతో ఆమె రేంజి పెరిగి ఉంటుందనే అనుమానంతో కొందరు ఆమె జోలికి రావటంలేదని ఫీలవతుతోంది. అయితే సింహా సక్సెస్ కేవలం బాలకృష్ణకు మాత్రమే కలిసి వచ్చిందని, దర్శకుడు బోయపాటికి రెమ్యునేషన్ పెంచుకునేలా చేసిందని అంతేగాని మిగతా ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ కు ఏమీ కలిసి రాలేదని అంటున్నారు. దీనికి తగ్గట్లే నమిత, నయనతార కూడా ఏమీ క్రేజీ కాలేకపోవటం ఆసక్తికర అంశం.


Click it and Unblock the Notifications











