అవే పోలికతో నాకు చాలా ఇబ్బందిగా వుంది!
బాలీవుడ్ అప్ స్టార్ ఐశ్వర్య రాయ్ పోలికలు కలిగి ఉన్న సెక్సీ భామ స్నేహా ఉల్లాల్. 'ఉల్లాసంగా ఉత్సాహంగా..నేను మీకు తెలుసా..? 'కరెంట్" తో పాటు 'సింహా" లోనూ నటించింది. 'వరుడు" ఓపెనింగ్ షాట్ ఆమెపైనే తీశారు. అయితే సినీ కెరీర్ ఎలా ఉందని ప్రశ్నిస్తే సమాధానం ఇలా చెప్పింది. పారితోషికం ప్రధానం కాదు. వరుడులో నేను పోషించిన పాత్రను చూస్నే మీకది అర్ధమవుతుంది" అంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో నటించిన 'లక్కీ నో టైం ఫర్ లవ్" అనే చిత్రం తనకు అంత విజయాన్ని ఇవ్వలేదని దానికి కారణం తనకు సరైన గైడెన్స్ లేదనీ, ఈ సినిమా ద్వారా కెరీర్ ను ప్రారంభించిన తనకు ఐష్ తో పోలికలు తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతోంది. తెలుగులోనే మంచి వారు వున్నారనీ, ఇక్కడే తనకు చాలా బాగుందని చెబుతోంది.
ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ బాలకృష్ణ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'సింహా " చిత్రంలో నటిస్తున్నది. ఈచిత్రంలో స్నేహా ఉల్లాల్ తో పాటు మరో ఇద్దరు కథానాయికలైన నయనతార, నమిత ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయునున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











