రవితేజను ఆకట్టుకుని మురుస్తున్న స్నేహా ఉల్లాల్
జూ ఐశ్వర్యా రాయ్ గా పేరు తెచ్చుకుని వరస ఆఫర్స్ పట్టుకుంటున్న స్నేహ ఉల్లాల్ తాజాగా రవితేజ చిత్రంలో బుక్ అయ్యి మరో మెట్టు ఎక్కింది. రవితేజ, కృష్ణవంశీ దర్శకత్వంలో రానున్న కందిరీగ చిత్రంలో ఈ పెయిర్ కనపడనుంది. దీనికి గానూ రవితేజే ఆమెను రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో స్టార్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో కనపడనుంది. ఇక స్నేహ ఉల్లాల్ కి ఈ చిత్రం సెట్ అవగానే..తన అందాలను కృష్ణవంశీ మరింత హాట్ హాట్ గా చూపిస్తాడని మురిసిపోతోంని చెప్తున్నారు. తెలుగులో ఉల్లాసంగా..ఉత్సాహంగా తో పరిచయమైన ఈ భామ తర్వాత మనోజ్ సరసన నేను మీకు తెలుసా చిత్రంలో చేసింది. అది పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో అనతరం సుశాంత్ సరసన కరెంట్ అంటూ మురిపించింది. కానీ అదీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవటంతో డైలామో లో పడిపోయింది.
దాంతో స్నేహ ఉల్లాల్ తాను గాంధీ పార్క్ అనే ఇంగ్లీష్ చిత్రంలో బిజీగా ఉన్నానంటూ బిల్డప్ ఇచ్చి హైదరాబాద్ లో తిరుగుతోంది. చివరకు రవితేజ కంటపడి ఈ కందిరీగ ఆఫర్ చేజిక్కుచ్చుకుంది. ఇక ఈ కందిరీగ చిత్రం జనవరి 9,2010 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.అలాగే హీరో రవితేజ ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయులు ముని..ముని మనవడుగా ప్రత్యేకమైన కనిపించనున్నారు. చక్రవర్తి వారసుడు ఈ కాలంలో ఏం చేస్తున్నాడు అన్నదానికి ఓ బర్నింగ్ ఇష్యూని ముడేసి కృష్ణవంశి సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చాలాకాలం తర్వాత రాశి ఓ ఐటం సాంగ్ తో కనిపించి అలరించనున్నదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











