నాగార్జున కోసం జాకెట్ లేకుండా స్నేహ
రొమాంటిక్ హీరో నాగార్జున కోసం స్నేహ జాకెట్ లేకుండా నటిస్తోందని తెలుస్తోంది. రాజన్న టైటిల్ తో తెలంగాణ పోరాటం నేపద్యంలో తెరకెక్కుతున్న పీరియడ్ మూవీలో ఆమె గిరిజన యువతిగా నటిస్తోందని, పాత్ర కోసం ఆమె జాకెట్ కూడా వేసుకోకుండా కనిపించనుందని తెలుస్తోంది. అలాగే ఆ రొమాంటిక్ సీన్స్ ను రాజమౌళి తెరకెక్కించాడని చెప్తున్నారు. మొదట యాక్షన్ సన్నివేశాలు మాత్రమే తెరకెక్కిస్తానని మాట ఇచ్చిన రాజమౌళి తన తండ్రి పనితనం చూసి రొమాంటిక్ సీన్స్ కూడా తనే భుజం మీద వేసుకుని తీసాడని చెప్తున్నారు. ఇన్నాళ్ళూ సంప్రదయాబద్దంగా కనపడ్డ స్నేహ ఈ క్యారెక్టర్ లో గ్యారెంటీగా కిక్ ఇస్తుందని, ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ అవుతుందని చెప్తున్నారు. ఇక నాగార్జున కనిపించే పాత్ర తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుందని యాక్షన్ ప్రధానంగా రూపొందుతుందని సమాచారం. రజాకార్ల ఉద్యమం నేపద్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధుడి కధతో 'రాజన్న' తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ చిత్రం కథ జరిగే కాలం..1945-55. ఇక ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు.


Click it and Unblock the Notifications











