నాగచైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి డేట్స్ ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

సినిమా పరిశ్రమలో నాగచైతన్య అక్కినేని, శోభితా ధూళిపాల ఎంగేజ్‌మెంట్ వ్యవహారం అనేక రూమర్లకు, గాసిప్స్‌కు స్కోప్‌గా మారింది. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య డేటింగ్ వ్యవహారం రెడ్ హ్యండెడ్‌గా తెలిసినా ఇంత వేగంగా వారిద్దరి నిశ్చితార్థం జరుగుతుందని ఊహించలేదు. అక్కినేని, ధూళిపాల కుటుంబాలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకొని మీడియాకే కాకుండా అభిమానులకు కూడా షాకిచ్చారు. అయితే నిశ్చితార్థం తర్వాత చైతూ, శోభితా పెళ్లికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయం చర్చనీయాంశమైంది. అయితే ఈ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ అనే వివరాల్లోకి వెళితే..

సమంత రుత్ ప్రభుతో బ్రేకప్ తర్వాత శోభితతో కలిసి చైతూ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫోటోతో వారిద్దరి అఫైర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత వారిద్దరి గురించి రకరకాల ఊహాగానాలు, కథనాలు మీడియాలో వెలుగు చూశాయి. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గాసిప్స్‌గా మాత్రమే మిగిలాయి.

Sobhita Dhulipala and Naga Chaitanya marriage date fixed Here Wedding place and month details

ఇలాంటి గాసిప్స్ వార్తల మధ్య ఆగస్టు రెండోవారంలో ఆకస్మాత్తుగా, మీడియాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిశ్చితార్థం జరిపించారు. ఆ తర్వాత నిశ్చితార్థం వివరాలను నాగ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దాంతో వారి అఫైర్‌కు ఇరు కుటుంబాల ఆమోద ముద్ర పడినట్టు అయింది.

ఇదిలా ఉంటే..శోభితా, నాగచైతన్య పెళ్లి విషయంపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ వీరిద్దరి పెళ్లి మాత్రం తండేల్ మూవీ రిలీజ్ తర్వాత ఉండేలా చైతూ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ లోగా శోభితా ధూళిపాల తన ప్రాజెక్టులు ముగించుకొనేలా ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారం.

Sobhita Dhulipala and Naga Chaitanya marriage date fixed Here Wedding place and month details

అయితే చైతు, శోభితా పెళ్లి మాత్రం ఈ ఏడాది చివర్లో గానీ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక పెళ్లి ఇండియాలోని రాజస్థాన్‌లో గానీ.. లేదా ఫారిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

నాగచైతన్య, శోభితా ధూళిపాల కెరీర్ విషయానికి వస్తే.. చైతూ తండేల్ సినిమా షూట్స్ బిజీగా ఉన్నారు. ఇక కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.శోభితా విషయానికి వస్తే.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X