Sobhita Chaitu Marriage: శోభిత, చైతూ పెళ్లికి గెస్టులు జాబితా..హాజరయ్యే సినీ ప్రముఖులు ఎవరెవరు అంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈవెంట్‌లో నాగచైతన్య అక్కినేని, శోభిత ధూళిపాల పెళ్లి వ్యవహారం ఒకటి. ఇప్పటికే ఈ వివాహ వేడుకలను సంప్రదాయంగా మొదలయ్యాయి. పెళ్లికి ముందు హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే పనులను ప్రారంభించి మ్యారేజ్ పనులను వేగం వంతం చేశారు. అయితే అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగే టాప్ సెలబ్రిటీ మ్యారేజ్ ఈవెంట్‌కు ఆహ్వానితుల జాబితాను అక్కినేని, ధూళిపాల ఫ్యామిలీస్ సిద్దం చేసినట్టు తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్యతో శోభిత ప్రేమ వ్యవహారంపై మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ.. ఎలాంటి స్పందన వారి నుంచి రాలేదు. కానీ లండన్‌లో వారిద్దరూ కలిసి హోటల్ కనిపించడంతో ఆ వార్త నిజమేనని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా రెండు కుటుంబాల అంగీకారంతో చైతూ,శోభితా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Sobhita Dhulipala Naga Chaitanya Marriage Guest List Here Chiranjeevi Mahesh Babu and Who are in the list

ఇక ఇటీవల శోభిత నివాసంలో హల్దీ వేడుకకు సంబంధించి, అలాగే పెళ్లిలో ఉపయోగించే పసుపు కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు దంచుడు కార్యక్రమాన్ని వేద పండితుల ఆశ్వీర్వచనం, పూజలతో ట్రెడిషనల్‌గా మొదలు పెట్టారు. ఆ వేడుకలోని ఫోటోలు కూడా శోభిత తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

చైతూ, శోభిత వివాహానికి సంబంధించిన గెస్టులు, ఆహ్వానితుల జాబితాను కూడా సిద్దం చేసినట్టు తెలుస్తుంది. ఇరు కుటుంబాల ప్రైవేట్ వ్యవహారంగా జరిగే ఈ పెళ్లి కోసం సెలెక్టెడ్‌గా ప్రముఖులను పిలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇరు కుటుంబాల సభ్యులు, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌‌ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అలాగే స్నేహితులు, సన్నిహితులను కూడా తమ జాబితాలో చేర్చినట్టు తెలుస్తున్నది.

Sobhita Dhulipala Naga Chaitanya Marriage Guest List Here Chiranjeevi Mahesh Babu and Who are in the list

ఇదిలా ఉండగా, సినిమా పరిశ్రమ నుంచి చైతూ పెళ్లి వేడుకలో దగ్గుబాటి కుటుంబం, అలాగే మెగా ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించనున్నట్టు తెలిసింది. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ ఫ్యామిలీ, ఇతర కుటుంబాలను ఆహ్వానించనున్నట్టు తెలిసింది. ఇక సినిమా ఇండస్ట్రీలోని రాజమౌళి, ఇతర ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సినిమా నటులను ఆహ్వనించేందుకు సిద్దం అవుతున్నారు.

చైతూ, శోభిత పెళ్లిని డిసెంబర్ 4వ తేదీన కనువినీ ఎరుగని రీతిలో జరిపించేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు 22 ఎకరాల్లో ఉన్న ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. పెళ్లి కోసం భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. అలాగే స్టూడియోను బ్రహ్మండంగా తీర్చిదిద్దుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X