Shobitha తేలిపోయిన శోభిత, నాగ చైతన్య ప్రేమ వ్యవహారం.. చై అలా షాకిచ్చి..!
స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ సినిమాల కంటే ఎక్కువగా అక్కినేని నాగ చైతన్య తో లవ్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తోంది. ఈ రోజు వీరిద్దరి బంధంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాగ చైతన్య ఆ ఒక్క పని చేస్తే చాలు శోభిత తో డేట్ చేస్తున్నాడా? లేదా అనే విషయం స్పష్టం అవుతుంది. ఇంతకీ చై చేయాల్సిన పనేంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
నాగ చైతన్య, సమంత పెళ్లయి నాలుగేళ్లు అయింది. ఈ మాజీ జంట 2021 అక్టోబర్ లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అనుకున్న చై-సామ్ జంట విడాకుల బాట పట్టడం చాలా మందికి షాకిచ్చింది.

విడాకుల వార్తల తరువాత ఇద్దరూ కలవలేదు. ఇప్పుడు ఇద్దరూ తమ తమ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య ఇప్పుడు శోభితతో సన్నిహితంగా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా శోభిత ముందుగా మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 'రమణ్ రాఘవ్ 2.0' సినిమాతో కలర్‌ఫుల్ కెరీర్‌ని ప్రారంభించింది. ఈ చిత్రం 2016లో విడుదలైంది. ఆ తర్వాత తెలుగు, మలయాళ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. శోభిత నటించిన 'ది నైట్ మేనేజర్' వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో శోభిత మేజర్ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో అడవి శేష్ హీరోగా నటించాడు.
ఇందులో ఆమె కావేరీ దీక్షిత్ అనే పాత్రలో నటించింది. అందులో తన నటనకు గానూ అవార్డు కూడా అందుకుంది. రీసెంట్ గా మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. ఈ మూవీ ఇంకా ఇండియాలో రిలీజ్ కాలేదు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికైంది అనే రూమర్స్ విన్పిస్తున్నాయి.

శోభిత హిందీ, తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు నాగ చైతన్యతో మంచి స్నేహం ఏర్పడింది, ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా కరెక్ట్ గా క్లారిటీ లేదు. కానీ ఈరోఉజ్ నాగ చైతన్య ఆ ఒక్క పని చేస్తే చాలు క్లారిటీ వస్తుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.
అసలు విషయం ఏమిటంటే ఈరోజు నాగ చైతన్య శోభితను ప్రేమగా విష్ చేస్తే డేటింగ్ విషయం ఖాయం అయినట్టే. వీరి ప్రేమపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మే 31న శోభిత పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నాగ చైతన్య ఆమెను ప్రేమతో విష్ చేస్తే వీరిద్దరూ లవ్ లో ఉన్నట్టే అని కన్ఫర్మ్ అవుతుంది. అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమెకు విషెస్ చెప్పకుండా అభిమానులకు షాకిచ్చాడనే విషయం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











