రజనీకాంత్ మాయలో పడిపోయిన బాలీవుడ్ హీరోయిన్...
రోబో సినిమా బాలీవుడ్ లోనూ సంచలనాలే సష్టిస్తోంది. ఇండియన్ సినిమా స్ర్కీన్ సై సరికొత్త సంచలనమంటూ బాలీవుడ్ దిగ్గజాలు సైతం 'రోబో"పై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు. రజనీతో పోల్చితే తనలో హుషారు కాస్త తక్కువేనంటూ బాలీవుడ్ బిగ్ వి అమితాబ్ బచ్చన్ సైతం ప్రశంసలు గుప్పించిన సంగతి విదితమే.
ఇక తాజాగా రజనీకాంత్ ని 'రోబో"లో చూసి షాక్ కి గురయ్యాననీ, అరవయ్యేళ్ళ వయసులో అంత ఎనర్జీ ఒక్క రజనీకే సాధ్యమయ్యిందని అంటోంది బాలీవుడ్ భామ సోహా అలీఖాన్. రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాయ్, కెరీర్ లో గొప్ప సినిమా చేసిన అనుభూతిని దక్కించుకోవడంతో పాటు, ఓ గొప్ప హీరోతో నటించిన అనుభవం సొంతం చేసుకుందని సోహా అభిప్రాయపడింది. ఇప్పటి వరకూ తాను అమితాబ్, అమీర్ ఖాన్ లంటే తెగ ఇష్టపడే దాన్ననీ, రోబో చూశాక రజనీకాంత్ కి వీరాభిమానిగా మారిపోయాననీ, రజనీకాంత్ అంటే పడిచచ్చే వీరాభిమానుల్లో తానూ చేరిపోయానని సోహా చెప్పుకొచ్చింది. ఇంతకీ, సోహా అలీఖాన్ ని రజనీ అంతగా ఏ విషయంలో మెస్మరైజ్ చేసేశాడో గానీ, రజనీ తదుపరి సినిమాలో ఛాన్స్ కోసం రజనీకాంత్ ని కలుస్తానంటూ సోహా ప్రకటించడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications











