సాయి ధరమ్ తేజ్ సినిమాకు ఓటీటీలో భారీ ఆఫర్.. ఈసారైనా ఒప్పుకుంటారా?
మెగా యువ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద ఇంకా అనుకున్నంత స్థాయికి చేరుకోవడం లేదు. వరుణ్ తేజ్ కూడా మెల్లమెల్లగా తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ చాలాబ్వరకు ఆ విషయంలో కష్టపడాల్సి ఉంది. వరుస అపజయాల అనంతరం ఈ మెగా హీరో చిత్ర లహరి సినిమాతో సెట్టయిన విషయం తెలిసిందే.
ఆ తరువాత మారుతి దర్శకత్వంలో చేసిన ప్రతి రోజు పండగే సినిమా ఈ హీరో రేంజ్ కి అసలైన బాక్సాఫీస్ హిట్ ను అందించింది. ఇక నెక్స్ట్ అంతకంటే హై రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని అనుకొని సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో రావాలని అనుకున్నాడు. కానీ కరోనా వైరస్ లాల్ డౌన్ కారణంగా ఆ సినిమా వాయిదా పడింది.

ఆ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. థమన్ ఇచ్చిన ఒక సాంగ్ ఇప్పటికే సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని గత నెలలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ వర్గాలు మాత్రం సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాయి.
ఇక ఇటీవల ఒక బడా ఓటీటీ సంస్థ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను డైరెక్ట్ గా వారి ఛానెల్ లో రిలీజ్ చేయడానికి ఒక ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. సినిమాను 22కోట్ల లోపే నిర్మించారని టాక్. ఇక సినిమాకు మొత్తంగా 25కోట్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.


Click it and Unblock the Notifications











