విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య ఏం జరుగుతోంది? ఆ వార్తలు నిజమేనా..?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ- రష్మిక జోడీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ కావడమే గాక ఈ ఇద్దరూ సూపర్ హిట్ జోడీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ గురించిన ఊహాగానాలు కొన్ని సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అసలింతకీ ఈ వార్తలు పుట్టడానికి కారణాలేంటి? నిజంగానే విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య ఏదైనా ఉందా? వివరాల్లోకి వెళ్లి పరిశీలిస్తే..

పర్ఫెక్ట్ కెమిస్ట్రీ.. రొమాంటిక్ జోడీ

పర్ఫెక్ట్ కెమిస్ట్రీ.. రొమాంటిక్ జోడీ

కొందరు హీరో హీరోయిన్ల మధ్య పర్ఫెక్ట్ కెమిస్ట్రీ కుదురుతుంది. రొమాన్స్ చేసినా, ముద్దులు పెట్టుకున్నా, చిందులేసినా ఆ జోడీని చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాంటి అరుదైన జోడీల్లో విజయ్ దేవరకొండ- రష్మికల జోడీ ఒకటి. అయితే ఈ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదండోయ్.. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫుల్లుగానే ఉంటుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్‌టైన్ చేస్తుంటారు.

వరుస సినిమాలు.. ముద్దులే ముద్దులు

వరుస సినిమాలు.. ముద్దులే ముద్దులు

గతంలో 'గీత గోవిందం' సినిమాలో తమ లిప్ లాకుల్లో ఉన్న మజా ఏంటో చూపించి కుర్రకారు హృదయాలను దోచుకుంది విజయ్ దేవరకొండ- రష్మిక జంట. ఇక ఆ తర్వాత వెంటనే డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు ఈ ఇద్దరూ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ లోనూ వర్షంలో ముద్దుల్లో తడుస్తూ కనిపించారు. దీంతో ఈ జంటపై ఊహాగానాలు మెల్లగా మొదలయ్యాయి.

మహేష్ ఎఎంబీ సినిమాస్ లో

మహేష్ ఎఎంబీ సినిమాస్ లో

అయితే రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ కలిసి 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమా చూశారు. అయితే అఫీషియల్‌గా బయటకొచ్చిన ఈ గ్యాంగ్ ఫొటోల్లో రష్మిక కన్పించలేదు గానీ.. సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫొటోల్లో మాత్రం రష్మిక దర్శనమిస్తోంది. పైగా వీరంతాకలిసి గ్రూప్‌ పార్టీ చేసుకొని ఛిల్ అవుట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

ఊహాగానాలకు రెక్కలు

ఊహాగానాలకు రెక్కలు

ఇప్పటికే నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడానికి విజయ్ దేవరకొండనే కారణం అనే రూమర్లు తెగ వినిపించాయి. తాజాగా ఇలా గ్రూప్ పార్టీలో పార్టిసిపేట్ చేయడంతో ఊహాగానాలకు రెక్కలు కట్టారు కొందరు. విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య ఏదో జరుగుతోందని, అందుకే ఇలా షికార్లు కొడుతున్నారని మరిన్ని వార్తలు స్ప్రెడ్ చేశారు.

అసలు సంగతేంటి..?

అసలు సంగతేంటి..?

దీంతో అసలు సంగతేంటి..? విజయ్ దేవరకొండ- రష్మికలు ప్రేమించుకుంటున్నారా లేక క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనా? అనేది అర్థంకాక సతమతమవుతున్నారు ప్రేక్షకులు. సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ప్రేమలపై రూమర్స్ అరవడం కామనే అయినా.. విజయ్ దేవరకొండ- రష్మిక లది క్రేజీ జోడీ కావడంతో ఈ వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. చూడాలి మరి ఇలాంటి వాటిపై ఆ ఇద్దరిలో ఎవరన్నా స్పందిస్తారా? లేదా? అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X