స్టార్ హీరోతో సదా ఇప్పటికీ హాట్ ఎఫైర్?
సదాకి సినిమాలు లేకపోయినా స్టార్ హీరో మాదవన్ తో ఎఫైర్ కొనసాగిస్తూ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఈ విషయమై తమిళ మీడియా క్రితం వారం కథనాలు ప్రసారం చేసింది. అయితే సదా కామన్ గానే వాటిని ఖండిస్తోంది. నాకు..ఎఫైర్స్ పెట్టుకుని కంటిన్యూ చేసేంత ఓపిక, టైమ్ లేదు అంటోంది. అయినా మాధవన్ తో రిలేషన్ అంటూ రాస్తున్నారు. నేను మాదవన్ పర్శనల్ గా కలిసి రెండేళ్ళు పైగా అవుతోంది తెలుసా. నేను కన్నడ సినిమాల్లో బిజీగా ఉన్నాను. అతను హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నాడు అంది. అయితే మొన్నా మధ్య ఇద్దరూ ముంబైలో కనపడ్డారంటూ అక్కడ పత్రికలు కథనాలు వెల్లడించాయి కదా అని అడిగితే...అయినా అలా ఒక్కసారి కో స్టార్ ని కలిసినంత మాత్రాన సంభందం అంటగట్టేస్తారా అని ప్రశ్నించింది. నాకు ఇవన్నీ వింటుంటే అప్పుడప్పుడూ ఆశ్చర్యంగానూ...ఎప్పుడూ షాకింగ్ గానూ ఉంటుంది అంది.


Click it and Unblock the Notifications











